Prabhas’ Birthday: ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా అదిరిపోయే అప్‌డేట్స్!
అప్‌డేట్స్!

Prabhas’ Birthday: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు వరుస సర్‌ప్రైజ్‌లు వచ్చాయి. అక్టోబర్ 23న ప్రభాస్ 47వ పుట్టినరోజు సందర్భంగా ‘కల్కి 2898 AD’ టీమ్ ప్రత్యేకమైన బీటీఎస్ వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోలో సినిమా షూటింగ్‌కు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విజువల్స్ కనిపించాయి. ప్రభాస్‌ను ‘ఇండియన్ సినిమా సూపర్‌హీరో’గా పేర్కొంటూ చిత్రబృందం ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. దీంతో ప్రభాస్ అభిమానుల్లో ఈ వీడియోపై భారీగా ఆసక్తి పెరిగింది.
ముఖ్యంగా ‘కల్కి 2’పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. మొదటి భాగంలో భైరవగా కనిపించిన ప్రభాస్.. సీక్వెల్‌లో కూడా అదే పాత్రలో కనిపించనున్నాడు. దీంతో రెండో భాగంలో కథ ఏ స్థాయిలో ఉండబోతుంది? ప్రభాస్ పాత్రకు ఇంకా ఎలాంటి ప్రాధాన్యత ఉంటుంది? అనే ఆసక్తి అభిమానుల్లో ఉంది.
ఇదే సమయంలో ప్రభాస్ మరో సినిమా ‘ఫౌజీ’కి సంబంధించిన కొత్త పోస్టర్ కూడా ఆయన పుట్టినరోజు సందర్భంగా విడుదలైంది. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై కూడా మంచి బజ్ ఉంది. దీంతో ఒక్క పుట్టినరోజు సందర్భంగా ప్రభాస్ నుంచి రెండు సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్ రావడం ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్‌గా మారింది.

