సినిమాలతో చాలా బిజీ

Sunil: కెరీర్ లో కామెడియన్ గా, హీరోగా నటించి పుష్ప సినిమాలో కమ్ బ్యాక్ ఇచ్చిన సునీల్ త నకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ తెచ్చుకున్నాడు . ప్రస్తుతం ఆర్టిస్టుగా వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. తెలుగు, తమిళ భాషల్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. లేటెస్ట్ గా తను కీలక పాత్రలు పోషిస్తున్న కొత్త చిత్రాలను ప్రకటించారు. ఆయా మూవీ మేకర్స్. మలయాళ సూపర్ హిట్ 'మార్కో' తరువాత షరీఫ్ మహమ్మద్ నిర్మిస్తున్న మ్యాసీవ్ ప్రాజెక్ట్ 'కట్టలన్' చిత్రంలో సునీల్ ఇంపార్టెంట్ రోల్ పోషిస్తున్నట్టు ప్రకటిస్తూ ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేశారు.
స్టైలిష్ లుక్లో సన్నగా కనిపిస్తున్న సునీల్ లుక్ ఆకట్టుకుంది. ఆంటోనీ వర్గీస్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి పౌల్ జార్జ్ దర్శకత్వం వహిస్తున్నాడు. మరోవైపు రాజ్ తరుణ్ హీరోగా విజయ్ మిల్టన్ దర్శకత్వంలో రూపొందుతోన్న తెలుగు, తమిళ బైలింగ్విల్ చిత్రంలోనూ సునీల్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్టు ప్రకటించారు. ఇందులోని తన పాత్రలో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయని మేకర్స్ చెప్పారు. జూన్ 15న ఈ మూవీ టైటిల్ను అనౌన్స్ చేయనున్నట్టు తెలియజేశారు.
