ఫర్హాన్ అక్తర్

Farhan Akhtar as Don: తన డ్రీమ్ ప్రాజెక్ట్ డాన్ 3ని తెరకెక్కిస్తున్న దర్శక నిర్మాత ఫర్హాన్ అక్తర్.. అందులో డాన్ పాత్ర కోసం ప్రముఖ హీరోలను సం ప్రదించాడు. ముందుగా ఓకే చెప్పిన షారుక్ ఖాన్, రణ్ వీర్ సింగ్, హృతిక్ రోషన్ఆ తర్వాత ముఖం చాటేశారు. ఒకరు కాదంటే మరొకరు అన్నట్లు అందరినీ అడిగిన తర్వాత చివరకు ఎవరూ సిద్దంగా లేకపోవడంతో తానే ఆ పాత్ర చేయాలనే నిర్ణయానికి వచ్చాడంట.

దీంతో డాన్ ఫ్రాంచైజీలో మొదటి సినిమాలో అమితాబ్ బచ్చన్, రెండో సినిమాలో షారుక్ ఖాన్ ను చూసిన ప్రేక్షకులు ఇప్పుడు మూడో సినిమాలో దర్శకుడు ఫర్హాన్ ను ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారోనని చర్చ ఇండస్ట్రీలో మొలైంది. రణ్వీర్ సింగ్ సినిమా ప్రకటించినప్పుడు సోషల్ మీడియాలో భారీ స్థాయిలో నెగెటివిటీ వచ్చింది. హృతిక్ రోషన్ ఇప్పటికే డాన్ 2లో ఒక చిన్న క్యామియోలో కనిపించాడు. డేట్స్ సమస్య కారణంగా ఆయన ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో తనే స్వయంగా రంగంలోకి దిగుతున్న డైరెక్టర్ తన నటనతో మ్యాజిక్ చేస్తే అది బాలీవుడ్లోనే పెద్ద సక్సెస్ అవుతుంది. లేదంటే ప్రాంచైజీకి ముగింపు కావచ్చు.

PolitEnt Media

PolitEnt Media

Next Story