సంస్కృత శ్లోకాల సీక్రెట్ ఏంటో తెలుసా..?

Fauji Title: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సీతారామం ఫేమ్ హను రాఘవపూడి కాంబినేషన్‌లో వస్తున్న భారీ పీరియడ్ డ్రామా చిత్రానికి ఫౌజీ అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ చిత్రబృందం అధికారిక ప్రకటన విడుదల చేసింది. అయితే టైటిల్ ప్రకటనలో సంస్కృత శ్లోకాలను ఉపయోగించడంపై వచ్చిన ఊహాగానాలపై దర్శకుడు హను రాఘవపూడి తాజాగా స్పష్టతనిచ్చారు.

శ్లోకాల వెనుక ఉద్దేశం:

"మా యోధుడి కథకు మరింత గంభీరత, లోతైన అర్థాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతోనే సంస్కృత శ్లోకాలను ఉద్దేశపూర్వకంగా ఉపయోగించాం. అయితే ఇది పౌరాణిక చిత్రం కాదు. మేము భగవద్గీత నుంచి కేవలం తాత్విక స్ఫూర్తిని మాత్రమే తీసుకున్నాం" అని హను రాఘవపూడి వివరించారు.

'ఫౌజీ' కథా నేపథ్యం

'ఫౌజీ' చిత్రం గురించి ఆయన మరింత వివరిస్తూ... "ఈ చిత్రం బ్రిటిష్ కాలం నాటి సామాజిక-రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో సాగే ఒక శక్తివంతమైన దేశభక్తి డ్రామా. ఇందులో మానవ భావోద్వేగాలకు పెద్దపీట వేశాం. ఆనాటి సమస్యలు నేటికీ ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి" అని పేర్కొన్నారు.

అంచనాలు తారాస్థాయికి:

సీతారామం వంటి మూవీతో మెప్పించిన హను, ఈ సినిమాను కూడా భారీ స్థాయిలో అద్భుతమైన విజువల్స్‌తో తెరకెక్కిస్తున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ మళ్లీ పూర్తిస్థాయి పీరియడ్ డ్రామాలో నటిస్తుండటంతో అభిమానుల్లో అంచనాలు తారాస్థాయికి చేరాయి. 1940ల నేపథ్యంలో సాగే ఈ చారిత్రక కథలో, ప్రభాస్ విధి, భావోద్వేగం, సిద్ధాంతాల మధ్య నలిగిపోయే ఒక సంక్లిష్టమైన పాత్రలో కనిపించనున్నారని సమాచారం.

స్టార్ కాస్ట్, టెక్నీషియన్స్

ఈ చిత్రంలో ప్రభాస్ సరసన ఇమాన్వి కథానాయికగా నటిస్తోంది. వీరితో పాటు అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, భానుచందర్, జయప్రద వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.సీతారామం బ్లాక్‌బస్టర్‌కు సంగీతం అందించిన విశాల్ చంద్రశేఖర్ ఈ చిత్రానికీ స్వరాలు సమకూరుస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story