తమిళనాడులో డైరెక్టర్‌ పారంజింత్‌ షూటింగ్‌ లో ఘటన

తమిళనాడులో ఫైటింగ్‌ సన్నివేల చిత్రీకరణకు జరుగుతున్న షూటింగ్‌ లో ప్రమాదవశాత్తూ ఫైట్‌ మాస్టర్‌ ఎస్‌.ఎం.రాజు దుర్మరణం పాలయ్యారు. తమిళ హీరో ఆర్య కథానాయకుడిగా ప్రముఖ తమిళ దర్శకుడు పా రంజిత్‌ దర్శకత్వంలో షూటింగ్‌ జరుపుకుంటున్న వెట్టువన్‌ సినిమాకు సంబంధించి తమిళనాడులోని ఓ ప్రాంతంలో కొన్ని ఫైట్‌ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఆదివారం కారు పైకి జంప్‌ చేసి పల్టీలు కొట్టే సన్నివేశాన్ని చిత్రీకరించారు. స్టంట్‌ మాస్ట్‌ ఎస్‌.ఎం.రాజు స్వయంగా ఆ కారు డ్రైవ్‌ చేస్తూ ఫైటింగ్‌ సన్నివేశాల్లో పాల్గొన్నారు. అయితే డైరెక్టర్‌ టేక్‌ చెప్పగానే కారు స్పీడుగా పోనిచ్చి ఓ గద్దెపైకి ఎక్కించి కారును గాలిలోకి లేపి పల్టీలు కొట్టించే క్రమంలో రాజు డ్రైవ్‌ చేస్తున్న కారు అదుపుతప్పి ఒకే సారి అతి వేగంతో కింద పడటంతో కారు విరిగిపోయింది. దీంతో ఆయన కారు డ్రైవింగ్‌ సీటులోనే ప్రాణం విడిచారు. గాలిలోకి జంప్‌ చేసిన కారు కొంత అసాధారణంగా కింద పడటం గమనించిన చిత్ర యూనిట్‌ పరుగు పరుగున కారు దగ్గరకు చేరుకోగా అప్పటికే రాజు మృతి చెంది ఉన్నాడు. స్టంట్‌ మాస్టర్‌ రాజు మృతి పట్ల హీరో విశాల్‌ స్పందించారు. ఈసంఘటనను ఆయన ధృవీకరిస్తూ రాజు కుటుంబానికి తాను జీవితాంతం అండగా నిలబడతానని హామీ ఇచ్చారు.

Updated On 14 July 2025 11:58 AM IST
Politent News Web 1

Politent News Web 1

Next Story