Fish Venkat: ఫిష్ వెంకట్ కన్నుమూత..కారణమిదే..
కారణమిదే..

Fish Venkat: టాలీవుడు ప్రముఖ హస్యనటుడు ఫిష్ వెంకట్ కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిన్న రాత్రి(జులై 18) కన్నుమూశారు. ఫిష్ వెంకట్ కు రెండు కిడ్నీలు పాడైపోయాయి. కిడ్నీ మార్పిడికి అయ్యే ఖర్చును భరిస్తామని తెలంగాణ ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే కిడ్నీ దాతలు ఎవరూ దొరక్కపోవడంతో తుదిశ్వాస విడిచారు. వెంకట్ మృతి పట్ల పలువురు టాలీవుడు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలిపారు.
హైదారాబాద్ లో పుట్టి పెరిగిన మంగిలంపల్లి వెంకటేశ్ మూడో తరగతి మధ్యలోనే ఆపేసి ముషిరాబాద్ లో చేపల వ్యాపారం చేస్తుండేవాడు. అలా ఫిష్ వెంకట్ గా సుపరిచితుడయ్యాడు. జంతర్ మంతర్ సినిమాతో కెరీర్ ప్రారంభించాడు. 100 కు పైగా సినిమాల్లో నటించిన ఫిష్ వెంకట్..చివరి సారిగా కాఫీ విత్ ఏ కిల్లర్ సినిమాలో నటించాడు. ఇది ఓటీటీలో రిలీజ్ అయ్యింది
