Fish Venkat’s Health: ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితి మరింత విషమం
పరిస్థితి మరింత విషమం

Fish Venkat’s Health: తెలుగు సినిమా ప్రేక్షకులను తెలంగాణ పంచ్ లతో అలరించిన నటుడు ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఆయనకు వెంటిలేటర్ పై చికిత్సలు అందిస్తు న్నారు. కమెడియన్ గానూ, విలన్ గానూ పలు చిత్రాల్లో మెప్పించిన వెంకట్ గత కొంతకా లంగా కిడ్నీ సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్నారు. గతంలో డయాలసిస్ తీసుకున్న ఆయన ఆరోగ్యం కొంత మెరుగు పడినప్పటికీ, కుటుంబాన్ని ఆదుకోండి' అంటూ సినీ ప్రముఖులకు, అభిమానులకు భావోద్వేగంతో విజ్ఞప్తి. ఇటీవల మళ్లీ క్షీణించడంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. వెంకట్ కు గాంధీ ఆసుపత్రిలో డాక్టర్ల ప్రకారం డయాలసిస్ తాత్కాలిక పరిష్కారమే, శాశ్వతంగా బతికేందుకు కిడ్నీ మార్పిడి అవసరమవుతుందని వెల్లడించారు. అయితే ఈ చికిత్సలు భారీ ఖర్చుతో కూడుకున్నవిగా ఉండటంతో, ఫిష్ వెంకట్ కుటుంబం తీవ్ర ఆర్థిక మస్యల్లో చిక్కుకుంది. ఈ పరిస్థితుల్లో ఆయన భార్య, కుమార్తె ‘దయచేసి మా కుటుంబాన్ని ఆదుకోండి' అంటూ సినీ ప్రముఖులకు, అభిమానులకు భావోద్వేగంతో విజ్ఞప్తి చేస్తున్నారు. వెంకట్ గాంధీ ఆసుపత్రిలో ఉచిత వైద్యం అందింది. అలాగే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రూ.2 లక్షల ఆర్థిక సాయం చేసి మానవత్వం చాటారు.ఇప్పుడు పరిస్థితి మరింత విషమించడంతో ఆ కుటుంబం ఆర్థిక సాయం కోరుతోంది.
