రియల్ లయన్ తో సినిమా

A Film with a Real Lion: ఇప్పటి వరకు సినిమాల్లో ఏఐ, గ్రాఫిక్స్ సింహాలు టైగర్లు పెట్టి సినిమాలు తీశారు కానీ...ఇపుడు ఫస్ట్ టైం రియల్ సింహాన్నిపెట్టి సినిమా తీస్తున్నారు డైరెక్టర్ కె.సి. రవిదేవన్. ఈ సినిమాకు సింఘా అనే టైటిల్ పెట్టారు. భారతదేశంలో పూర్తి నిడివి గల ఫీచర్ ఫిల్మ్ లో నిజమైన సింహాన్ని ఉపయోగించిన మొదటి సినిమా ఇదే. కె.సి. రవిదేవన్ గతంలో కమల్ హాసన్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు.

ఈ సినిమాలో ప్రధాన పాత్రలో శ్రితా రావు నటిస్తున్నారు. ఆమెతో పాటు లీషా ఎక్లెయిర్స్ కూడా ఒక ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. లీషా సినిమాలో 300 తోడేళ్లతో కలిసి నటించాల్సి వచ్చింది.1945, 'పోతునలన్ కౌర్తి, జవాన్' వంటి చిత్రాల్లో నటించిన లీషా ఎక్లెయిర్ ఎంపిక చేశారు. ఆమె ఈ పాత్రలో ఒదిగిపోయి చాలా పవర్ ఫుల్‌గా నటిస్తున్నారని చిత్ర బృందం తెలిపింది.

ఈ సినిమాను తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, మరియు హిందీ భాషల్లో పాన్-ఇండియా ఫిల్మ్ గా నిర్మిస్తున్నారు. వి. మథియలగన్ ఈ చిత్రాన్ని ఎట్సెటెరా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ మలేషియా, సింగపూర్, థాయిలాండ్, జాంబియా, గోవా, తెన్కాసి మరియు విశాఖపట్నం వంటి అనేక ప్రదేశాల్లో జరిగింది. ఇది ప్రపంచవ్యాప్తంగా సాగే కథ అని, పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఆనందిస్తారని దర్శకుడు తెలిపారు. కథలో ఒక సింహంతో పాటు కొన్ని తోడేళ్లతో కూడిన సన్నివేశాలు హైలెట్ గా నిలుస్తాయని చెప్పారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story