‘Cocktail 2’ Trailer: ఫ్రెండ్‌షిప్, లవ్ అండ్ రొమాన్స్.. కలర్ఫుల్గా 'కాక్‌టెయిల్ 2' ట్రైలర్!
కలర్ఫుల్గా 'కాక్‌టెయిల్ 2' ట్రైలర్!

‘Cocktail 2’ Trailer: షాహిద్ కపూర్, రష్మిక మందన్న, కృతి సనన్ లీడ్ రోల్స్‌లో నటించిన బాలీవుడ్ మూవీ ‘కాక్‌టెయిల్ 2’. హోమీ అద్జానియా దర్శకత్వం వహించారు. మంగళవారం ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఒకే అబ్బాయిని ప్రేమించిన ఇద్దరు ఫ్రెండ్స్ స్టోరీతో ఈ సినిమా ఉండబోతోందని ట్రైలర్‌లో చూపించారు. ఇందులో కునాల్‌గా షాహిద్, తనను ప్రేమించే దియా పాత్రలో రష్మిక, అల్లీగా కృతిసనన్ కనిపించారు. ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ ఒకే ఇంట్లో ఉంటూ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తుంటారు. వీరి మధ్య కెమిస్ట్రీ, హ్యూమర్, ట్రిప్స్ విజువల్‌గా ఇంప్రెస్ చేశాయి. అయితే కునాల్‌తో దియా రిలేషన్‌లో ఉండగా, అల్లీ కూడా కునాల్‌తో క్లోజ్‌గా ఉంటుంది. దీంతో ప్రాణ స్నేహితుల మధ్య మనస్పర్థలు వస్తాయి.
ఇద్దరిలో కునాల్ ఎవరిని ఎంచుకున్నాడు అనేది మిగతా కథ. ఫ్రెండ్‌షిప్, లవ్, రొమాన్స్, కామెడీ కలగలసిన ట్రయాంగిల్ లవ్‌స్టోరీ ఇది. ఇటలీలోని కలర్‌ఫుల్ లొకేషన్స్, ఈతరం యువతను ఆకట్టుకునే డైలాగ్స్, సాంగ్స్‌తో ట్రైలర్ ఇంప్రెస్ చేసింది. కృతితో పాటు రష్మిక మోడ్రన్ క్యారెక్టర్‌లో కనిపించింది. గ్లామర్ ప్రదర్శనలో ఈ ఇద్దరూ పోటీపడ్డారు. రష్మిక కెరీర్‌లోనే మోస్ట్ గ్లామరస్ రోల్ ఇదని తెలుస్తోంది. సైఫ్ అలీఖాన్, దీపికా పడుకోణె జంటగా వచ్చిన ‘కాక్‌టెయిల్’కు ఇది సీక్వెల్. అందులోని ‘తుమ్ హీ హో’ పాటను సీక్వెల్ కోసం రీ క్రియేట్ చేశారు. దినేష్ విజన్, లవ్ రంజన్, ప్రమిత ఆర్ విజన్, అంకుర్ గార్గ్ నిర్మిస్తున్నారు. ప్రీతమ్ సంగీతం అందిస్తున్నారు. జూన్ 19న థియేటర్స్‌కు వస్తోంది.

