Hanuman Ansh: బాలీవుడ్‌లో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఒక చిన్న చిత్రం ఇప్పుడు చరిత్ర సృష్టిస్తోంది. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలీ బాబా జీవిత కథ ఆధారంగా దర్శకుడు విశాల్ చతుర్వేది రూపొందించిన చిత్రం హనుమాన్ అంశ్. ఆగస్టు 7న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ, నెమ్మదిగా మొదలై ఇప్పుడు దేశవ్యాప్తంగా వసూళ్ల సునామీని సృష్టిస్తోంది. మొదటి రెండు వారాలు కాస్త నిదానంగా సాగిన ఈ చిత్రానికి, ఆ తర్వాత ప్రేక్షకుల నుంచి వచ్చిన పాజిటివ్ మౌత్ టాక్ ఊహించని బలాన్నిచ్చింది. మూడో వారం నుంచే వసూళ్లు పరుగులు పెట్టడంతో కేవలం 31 రోజుల్లోనే రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరింది.

ఐదో వారాంతంలో ఆల్‌టైమ్ రికార్డు

తాజాగా ముగిసిన ఐదో వీకెండ్ లన ఈ చిత్రం ఏకంగా రూ. 45.60 కోట్లు కొల్లగొట్టి సరికొత్త చరిత్ర లిఖించింది. ఇప్పటివరకు ఐదో వీకెండ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలుగా ఉన్న ధురంధర్ (రూ. 35.80 కోట్లు), పుష్ప 2 హిందీ (రూ. 14 కోట్లు) రికార్డులను ఇది సమూలంగా చెరిపివేసింది. ఐదో వారాంతపు కలెక్షన్లలో భారతీయ సినిమా చరిత్రలోనే నంబర్ వన్ చిత్రంగా నిలిచి ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేసింది.

విదేశాల్లో విడుదలకు సన్నాహాలు

దేశీయ బాక్సాఫీస్ వద్ద భారీ విజయదుందుభి మోగిస్తున్న హనుమాన్ అంశ్ చిత్రాన్ని సెప్టెంబర్ 11న ఓవర్సీస్ మార్కెట్‌లోనూ గ్రాండ్‌గా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దీంతో ఈ చిత్ర ప్రభావం అంతర్జాతీయ మార్కెట్‌లోనూ మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.

Next Story