‘Gabbar Singh’ Fame Actor Ramesh: గబ్బర్ సింగ్ ఫేమ్ నటుడు రమేష్‌కు బ్రెయిన్ స్ట్రోక్
బ్రెయిన్ స్ట్రోక్

‘Gabbar Singh’ Fame Actor Ramesh: టాలీవుడ్ ప్రముఖ నటుడు, ‘గబ్బర్ సింగ్’ ఫేమ్ రమేష్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు ఆకస్మికంగా బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో కుటుంబ సభ్యులు తక్షణమే హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో (ICU) నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో అత్యవసర చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఇంకా నిలకడగా లేకపోవడంతో నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు వైద్యులు తెలిపారు.
హరీష్ శంకర్ దర్శకత్వంలో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా వచ్చిన ‘గబ్బర్ సింగ్’ చిత్రంలో పోలీస్ స్టేషన్ అంత్యాక్షరి గ్యాంగ్, విలన్ బ్యాచ్ సభ్యుడిగా రమేష్ తనదైన కామెడీ టైమింగ్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ సినిమా తర్వాత 'గబ్బర్ సింగ్ రమేష్' గా గుర్తింపు పొంది, అనేక తెలుగు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కామెడీ విలన్‌గా అలరించారు.
రెండు రోజుల క్రితమే ఓ సినిమా షూటింగ్ లొకేషన్ నుంచి రమేష్ సోషల్ మీడియాలో వీడియో షేర్ చేశారు. ఇంతలోనే ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ రావడం సినీ వర్గాలను, పవన్ కళ్యాణ్ అభిమానులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ఆయన త్వరలోనే ఈ గండం నుంచి బయటపడి, సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని సినీ ప్రముఖులు, అభిమానులు ప్రార్థిస్తున్నారు.

