Gautham Ghattamaneni: సూపర్‌స్టార్ మహేష్ బాబు కుమారుడు గౌతమ్ ఘట్టమనేని ఇటీవల 20వ పుట్టినరోజు జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మహేష్ బాబు తన కుమారుడికి మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలిపారు. తాజాగా గౌతమ్ మరో కారణంతో సోషల్ మీడియాలో, సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారారు. ఇటీవల విడుదలైన ఓ పాన్ ఇండియా సినిమాకు ఆయన ఇచ్చిన రేటింగ్ ఇప్పుడు మూవీ లవర్స్ దృష్టిని ఆకర్షిస్తోంది. యశ్ నటించిన ‘టాక్సిక్’ చిత్రానికి గౌతమ్ ప్రముఖ మూవీ రేటింగ్ ప్లాట్‌ఫామ్ లెటర్‌బాక్స్‌డ్‌లో 5కి కేవలం 0.5 స్టార్ రేటింగ్ ఇచ్చారు.

గౌతమ్ ఇప్పటికే లెటర్‌బాక్స్‌డ్‌లో 400కు పైగా సినిమాలకు రేటింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. వివిధ భాషలు, విభిన్న జానర్లకు చెందిన సినిమాలను ఆయన చూస్తూ వాటికి తన అభిప్రాయం ప్రకారం రేటింగ్స్ ఇస్తున్నారు. అయితే ‘టాక్సిక్’కు ఆయన ఇచ్చిన అత్యంత తక్కువ రేటింగ్ ఇప్పుడు అభిమానులు, సినీ ప్రేమికుల ఆసక్తిని రేకెత్తించింది.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. విజయ్ దేవరకొండ నటించిన ‘లైగర్’ సినిమాకు కూడా గౌతమ్ 5కి 0.5 స్టార్ రేటింగ్ ఇచ్చారు. దీంతో ఈ రెండు సినిమాల విషయంలో గౌతమ్ అభిప్రాయం సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తోంది.

గౌతమ్ లెటర్‌బాక్స్‌డ్ యాక్టివిటీని పరిశీలిస్తే.. ఇతర యువ సినీ ప్రేక్షకుల మాదిరిగానే ఆయన కూడా వివిధ సినిమాలను చూస్తూ, వాటిపై తన అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేస్తున్నట్లు కనిపిస్తోంది. తన అభిప్రాయాలను ఇతరులు ఎలా స్వీకరిస్తారనే విషయాన్ని పెద్దగా పట్టించుకోకుండా, తాను చూసిన సినిమాలపై తనకు కలిగిన నిజమైన భావాలను రేటింగ్స్ రూపంలో వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే తన తండ్రి మహేష్ బాబు నటించిన పలు సినిమాలకు మాత్రం గౌతమ్ మంచి రేటింగ్స్ ఇచ్చారు. దీనిని బట్టి గౌతమ్‌కు సినిమాలపై ప్రత్యేకమైన ఆసక్తి ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన లెటర్‌బాక్స్‌డ్ ప్రొఫైల్ ద్వారా సినిమాల విషయంలో తన వ్యక్తిగత అభిరుచులు, తాను ఇష్టపడే చిత్రాల గురించి కొంతమేరకు తెలుసుకునే అవకాశం కలుగుతోంది.

మొత్తానికి ‘టాక్సిక్’కు గౌతమ్ ఇచ్చిన 0.5 స్టార్ రేటింగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఒక స్టార్ కిడ్‌గా కాకుండా ఓ సాధారణ యువ సినీ ప్రేక్షకుడిలా సినిమాలను చూసి తన అభిప్రాయాన్ని రేటింగ్ రూపంలో వ్యక్తం చేయడం ఇప్పుడు నెటిజన్ల

Next Story