తరుణ్ భాస్కర్ వీసా కష్టాలు

“Gayapadda Simham” Cinema Teaser: తరుణ్ భాస్కర్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా 'గాయపడ్డ సింహం కీలక అప్‌డేట్ వచ్చేసింది. చిత్ర బృందం - టీజర్ , ట్రైలర్ మిక్స్ చేసిన ట్రైజర్ అని పేరు విడుదల చేసింది. అమెరికా వెళ్లాలని కలలు కనే ఓ యువకుడు, డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాల వల్ల ఎలాంటి ఇబ్బందులు పడ్డాడనే అంశాన్ని చాలా సరదాగా, వ్యంగ్యంగా (Political Satire) ఈ సినిమాలో చూపించబోతున్నారు.ఈ ట్రైజర్‌లో తన సొంత సినిమా 'పెళ్లి చూపులు' గురించే తరుణ్ భాస్కర్ సెటైర్ వేసుకోవడం హైలైట్‌గా నిలిచింది. "పెళ్లి చూపులు సినిమా గురించి మీ అభిప్రాయం ఏంటి?" అని ఫరియా అబ్దుల్లా అడిగితే, తరుణ్ ఒక యావరేజ్ సినిమా.. ఓవర్ హైప్ అయింది అంతే అని చెప్పే డైలాగ్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.ఈ సినిమాని వేసవి కానుకగా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

ట్రైజర్‌లో ఉన్నట్లే, స్టేజ్ పైన కూడా ఆయన "నా పెళ్లి చూపులు సినిమా ఏదో అదృష్టం బాగుండి ఆడేసింది కానీ, అది ఒక యావరేజ్ సినిమానే" అని సరదాగా వ్యాఖ్యానించారు. తనను తాను ఒక 'యావరేజ్ డైరెక్టర్' అని, ఇప్పుడు 'బిలో యావరేజ్ యాక్టర్' అని పిలుచుకుంటూ సెల్ఫ్ రోస్టింగ్ చేసుకున్నారు.దర్శకత్వం వహించడం కంటే వేరే వాళ్ల సినిమాలో నటించడం చాలా సుఖంగా ఉంది. డైరెక్టర్ తిడతాడు కానీ, కనీసం మనకి ఏ టెన్షన్ ఉండదు" అని సరదాగా చెప్పారు.

ట్రంప్ మామ (డొనాల్డ్ ట్రంప్) తీసుకునే నిర్ణయాల వల్ల మన తెలుగు కుర్రాళ్లు అమెరికా వెళ్లలేక ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో ఈ సినిమాలో చాలా ఫన్నీగా చూపించాం. ఈ 'గాయపడ్డ సింహం' గర్జించదు.. కేవలం ఏడుస్తుంది, నవ్విస్తుంది" అని వివరించారు. సినిమా దర్శకుడు కశ్యప్ గురించి చెబుతూ.. "నేను ఒక సీరియస్ మ్యాటర్ చెబితే నవ్వుతారా అని కశ్యప్ అడిగారు, దానికి నేను 'నీ ఫేస్ చూస్తేనే అందరికీ నవ్వు వస్తుంది' అని చెప్పి ఒప్పించాను" అంటూ ఫన్నీగా చెప్పుకొచ్చారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story