ఎట్టుంటాదో చూద్దురు కానీ..

Ghati movie: అనుష్క,విక్రమ్ ప్రభు కలిసి నటిస్తోన్న ఘాటి' సినిమా ట్రైలర్ ఇటీవల విడుదలైంది. వేదం తర్వాత క్రిష్, అనుష్క కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ఇది. అనుష్క ఒక గంజాయి స్మగ్లర్‌గా శక్తివంతమైన పాత్రలో కనిపిస్తున్నారు.

ట్రైలర్‌లో అనుష్క పవర్ ఫుల్ డైలాగులు, యాక్షన్ సన్నివేశాలు సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన పొందింది. ట్రైలర్ చివరలో అనుష్క చెప్పిన సీతమ్మోరు లంకా దహనం చేస్తే ఎట్టుంటాదో చూద్దురు కానీ అని చెప్పిన డైలాగ్ బాగుంది. ముఖ్యంగా అరుంధతి తరహాలో అనుష్క రౌద్రంగా, శక్తివంతంగా కనిపించారని అభిమానులు అంటున్నారు. బ్రిటీష్ కాలంలో రక్తాన్ని చిందించి రోడ్డు మార్గాలు వేసిన 'ఘాటీ'ల కథ ఇది. ఇది ఒక గ్రామీణ డ్రామా, ట్రైబల్ టచ్‌తో ఎమోషన్స్‌కు పెద్ద పీట వేసినట్టు తెలుస్తోంది.

అనుష్కతో పాటు విక్రమ్ ప్రభు ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.విలన్స్‌‌గా చైతన్య రావు, రవీంద్రన్ విజయ్, పోలీస్ ఆఫీసర్‌‌‌‌గా జగపతి బాబు కనిపించబోతున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 5న థియేటర్లలో విడుదల కానుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story