Shiva 4K Trailer: గూస్ బంప్స్ తెప్పిస్తోన్న .. శివ 4కె ట్రైలర్ చూశారా.?
శివ 4కె ట్రైలర్ చూశారా.?

Shiva 4K Trailer: అక్కినేని నాగార్జున నటించిన కల్ట్ క్లాసిక్ సినిమా శివ. 1989లో రిలీజ్ అయిన ఈ సినిమా నాగార్జునకు ,రామ్ గోపాల్ వర్మకు కెరీర్ లోని బెస్ట్ ఐకానిక్ మూవీగా నిలిచింది. రీ రిలీజ్ సందర్భంగా ఈ సినిమా
4K డాల్బీ అట్మాస్ ట్రైలర్ ను విడుదల చేసింది టీం. ఈ ట్రైలర్ ప్రేక్షకులకు సినిమా అద్భుతమైన 4K విజువల్స్ , డాల్బీ అట్మాస్ సౌండ్‌తో ఒక సరికొత్త అనుభూతిని అందించింది. ముఖ్యంగా ఇళయరాజా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, సైకిల్ చైన్ లాగే ఐకానిక్ సీన్ సరికొత్త ఆడియోతో గూస్‌బంప్స్‌ను తెప్పిస్తున్నాయని అభిమానులు అంటున్నారు.
రామ్ గోపాల్ వర్మ సృష్టించిన ఆ పాత ఇంటెన్సిటీకి 4K నాణ్యతతో కొత్త మెరుగులు దిద్దారు. ఒరిజినల్ మోనో ట్రాక్‌ను AI టెక్నాలజీ సహాయంతో డాల్బీ అట్మాస్‌కు మార్చడం వల్ల యాక్షన్ సన్నివేశాలు,బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మరింత ఆసక్తికరంగా వినిపిస్తాయి. ఈ సినిమా అన్నపూర్ణ స్టూడియోస్ 50వ వార్షికోత్సవం సందర్భంగా, నవంబర్ 14, 2025న థియేటర్లలో 4K డాల్బీ అట్మాస్ వెర్షన్‌లో రీ-రిలీజ్ కాబోతోంది.
ట్రైలర్ విడుదల సందర్భంగా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ రాజమౌళి, నాగ్ అశ్విన్, సందీప్ రెడ్డి వంగ, శేఖర్ ఖమ్ముల ,మణిరత్నం, హీరోలు మెగాస్టార్ చిరంజీవి, మహేశ్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్ నాని శివ మూవీపై ప్రశంసలు కురిపించారు.

