Gollarammavva: ఓటీటీలోకి గొల్లరామవ్వ..స్ట్రీమింగ్ ఎపుడంటే.?
స్ట్రీమింగ్ ఎపుడంటే.?

Gollarammavva: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు రాసిన తెలంగాణ సాయుధ పోరాట గాథ ‘గొల్ల రామవ్వ’ సినిమాగా ప్రేక్షకుల ముందుకొస్తోంది. సీనియర్ నటి తాళ్లూరి రామేశ్వరి ప్రధాన పాత్రలో ముళ్ళపూడి వరా తెరకెక్కించారు. రామ్ విశ్వాస్ హనూర్కర్, రాఘవేంద్రవర్మ (బుజ్జి) నిర్మించారు. ఈనెల 25 నుంచి ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ కానుంది. గురువారం ట్రైలర్‌ను ప్రసాద్ ల్యాబ్స్‌లో లాంచ్ చేశారు. తమ తండ్రి రాసిన ‘గొల్ల రామవ్వ’ కథను ఎంతో గొప్పగా తెరకెక్కించారని పీవీ నరసింహారావు కొడుకు పీవీ ప్రభాకరరావు, కూతురు సురభి వాణీదేవి ప్రశంసించారు.
ఒకప్పటి 'సీతామాలక్ష్మి' తాళ్ళూరి రామేశ్వరి గొల్ల రామవ్వగా పవర్‌ఫుల్ పాత్రలో నటించారు. ఆమె నటన ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ కానుంది. అల్లు గీత, అన్విత్, మణి మంతెన కీలక పాత్రల్లో మెరిశారు. నటుడు రాజీవ్ కనకాల, దర్శకులు యాటా సత్యనారాయణ, ఉదయభాస్కర్, లిరిక్ రైటర్స్ కాసర్ల శ్యామ్, మౌనశ్రీ మల్లిక్ పాల్గొని దర్శకనిర్మాతలకు అభినందనలు తెలియజేశారు. మూవీ టీమ్ అంతా పాల్గొన్నారు.
పి.వి. నరసింహారావు గారు ఈ కథను 1940వ దశకంలో (1949లో 'భారతి' పత్రికలో) రాశారు. నిజాం పాలనలో, రజాకార్ల అరాచకాల సమయంలో ఒక సామాన్య యాదవ మహిళ (గొల్ల రామవ్వ) ఎంత ధైర్యంగా నిలబడింది అనేది ఈ కథాంశం. తెలంగాణ సాయుధ పోరాట నేపథ్యం ఉన్న గొప్ప కథ ఇది.

