'Varanasi' Glimpse: మహేశ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఆగస్టు 9న వారణాసి గ్లింప్స్?
వారణాసి గ్లింప్స్?

'Varanasi' Glimpse: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక పాన్ వరల్డ్ అడ్వెంచరస్ మూవీ ‘వారణాసి’. గ్లోబల్ స్థాయిలో అంచనాలు నెలకొన్న ఈ చిత్రంలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తుండగా, టాలెంటెడ్ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్నారు.
శ్రీ దుర్గా ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై కె.ఎల్. నారాయణ, ఎస్.ఎస్. కార్తికేయ అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రాజమౌళి మార్క్ ప్లానింగ్ వల్ల ఈ మూవీ షూటింగ్ ఎలాంటి ఆలస్యం లేకుండా శరవేగంగా సాగి చివరి దశకు చేరుకుంది.
ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో మరో కీలక షెడ్యూల్ ప్రారంభం కానుండగా, అక్టోబర్ నాటికి టోటల్ షూటింగ్ పూర్తి కానుంది. ఆ తర్వాత వీఎఫ్ఎక్స్, డబ్బింగ్ వంటి పోస్ట్ ప్రొడక్షన్ పనులపై యూనిట్ ఫోకస్ పెట్టనుంది.
ఇక మహేష్ బాబు అభిమానులకు డబుల్ ధమాకా ఇస్తూ.. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 9న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ భారీ అడ్వెంచర్ మూవీని వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఏప్రిల్ 7న వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు.

