దసరా బరిలో ఫౌజీ.!

Good News for Prabhas Fans: సీతారామం వంటి క్లాసిక్ హిట్ ను అందించిన దర్శకుడు హను రాఘవపూడి ఇప్పుడు రెబల్ స్టార్ ప్రభాస్ మాన్ హిట్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ఫౌజీ. ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం, ఫౌజీ సినిమా ఇప్పటి కే 70 శాతానికి పైగా చిత్రీకరణను పూర్తి చేసుకుంది. దర్శకుడు హను రాఘవ పూడి తనదైన శైలిలో ఎమోషన్ను పండిస్తూనే, యుద్ధ సన్నివేశాల ను విజువల్ వండర్ గా తీర్చిదిద్దుతున్నారు. ఇందుకోసం హై దరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీతో పాటు వివిధ ప్రాంతాల్లో భారీ సెట్లను నిర్మించి కీలక సన్నివే శాలను చిత్రీకరిస్తున్నారు.

ఇక అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఫౌజీ సినిమా విడుదల తేదీ విషయంలో కూడా మేకర్స్ ఒక క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని 2026 దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మైత్రీ మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దసరా సీజన్ పెద్ద సినిమాల వసూళ్లకు కలిసొచ్చే సమయం కావడంతో, ఆ లోపే పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేయాలని భావిస్తున్నారట. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉంది.

ఇది ఒక హిస్టారికల్ రొమాంటిక్ వార్ డ్రామా. 1940వ దశకంలో, అంటే రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో సాగే పీరియడ్ ఫిలిం ఇది. సమాచారం ప్రకారం, ఇందులో ప్రభాస్ ఒక బ్రిటిష్ ఇండియా సైనికుడిగా (Soldier) కనిపిస్తారు. 'సీతారామం' తర్వాత హను రాఘవపూడి రాసుకున్న మరో అద్భుతమైన ప్రేమకథగా ఇది ఉండబోతోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story