Jana Nayagan: కోలీవుడ్ స్టార్ హీరో, తమిళనాడు సీఎం విజయ్ నటించిన తాజా యాక్షన్ థ్రిల్లర్ 'జన నాయగన్' బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికే రూ.200 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకుపోతున్న ఈ సినిమాపై అభిమానులకు మేకర్స్ మరో అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు.

ఈ సినిమా నుంచి కొన్ని కారణాల వల్ల తొలగించిన సన్నివేశాలను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు దర్శకుడు హెచ్. వినోద్ అధికారికంగా వెల్లడించారు. ఈ చిత్రానికి సంబంధించి మొత్తం ఆరు సన్నివేశాలను ఎడిటింగ్ లో తొలగించినట్లు ఆయన తెలిపారు.

ఆ తొలగించిన వాటిలో రెండు కామెడీ, రెండు యాక్షన్, మరో రెండు ఎమోషనల్ సీన్లు ఉన్నాయని వినోద్ పేర్కొన్నారు. ఒకదాని తర్వాత ఒకటిగా వీటిని విడుదల చేయడానికి నిర్మాణ సంస్థ సన్నాహాలు చేస్తోందని, వచ్చే వారం నుంచి ఇవి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని చెప్పారు.

అయితే ఇప్పటికే ఈ సినిమా రన్ టైమ్ 3 గంటలు దాటడంతో.. ఈ డిలీటెడ్ సీన్స్‌ను నేరుగా థియేటర్లలో జత చేస్తారా? లేక సోషల్ మీడియా లేదా యూట్యూబ్‌లో విడుదల చేస్తారా? అనే దానిపై సందిగ్ధత కొనసాగుతోంది. దీనిపై పూర్తి స్పష్టత రావాలంటే మరో వారం రోజులు ఆగాల్సిందే.

PolitEnt Media

PolitEnt Media

Next Story