‘Bharatavarshe’ Glimpse: చారిత్రక యుద్ధ భూమిలో గోపీచంద్: ఆకట్టుకుంటున్న భారతవర్ష గ్లింప్స్
ఆకట్టుకుంటున్న భారతవర్ష గ్లింప్స్

‘Bharatavarshe’ Glimpse: మ్యాచో స్టార్ గోపీచంద్ ఇప్పుడు ఒక భారీ చారిత్రక యాక్షన్ అడ్వెంచర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘భారతవర్ష’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు. దీనికి ‘సాగా ఆఫ్ శూల’ అనే ట్యాగ్‌లైన్‌ను కూడా జోడించారు. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ వీడియో గ్లింప్స్‌ను ఈరోజు విడుదల చేయగా, అది సినిమా ఎంత గ్రాండ్‌గా ఉండబోతోందో కళ్ళకు కట్టినట్లు చూపిస్తోంది.
ఈ సినిమా కథ క్రీస్తు శకం 642వ సంవత్సరంలో, ‘శూల’ అనే ప్రాంతం నేపథ్యంలో సాగుతుంది. విడుదలైన గ్లింప్స్‌లో భారీ యుద్ధ సన్నివేశాలు, నిప్పు రవ్వల మధ్య జరిగే పోరాటాలు చూస్తుంటే ఇదొక అద్భుతమైన విజువల్ ఎక్స్‌పీరియన్స్ అని అర్థమవుతోంది. గతంలో ‘ఘాజీ’ వంటి సబ్‌మెరైన్ మూవీని, ‘అంతరిక్షం’ వంటి సైన్స్ ఫిక్షన్ సినిమాలను రూపొందించిన దర్శకుడు సంకల్ప్ రెడ్డి, ఇప్పుడు మొదటిసారిగా ఈ చారిత్రక కథను ఎంచుకోవడం విశేషం.
ఈ పాత్ర కోసం గోపీచంద్ తన బాడీ లాంగ్వేజ్ నుంచి నడక వరకు ప్రతిదీ మార్చుకుని, ఒక శక్తివంతమైన యోధుడిగా కనిపిస్తున్నారు. ఆయనకు జోడీగా రీతూ వర్మ కథానాయికగా నటిస్తోంది. సాంకేతికంగా కూడా ఈ సినిమా చాలా బలంగా ఉంది. సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ, చిన్నా ప్రొడక్షన్ డిజైన్, అనుదీప్ దేవ్ సంగీతం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించనున్నాయి. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, పవన్ కుమార్ సమర్పిస్తున్నారు.

