Gopichand’s New Film Announced: మ్యాచో స్టార్ గోపీచంద్ వరుస పెట్టి క్రేజీ ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న భరత వర్ష పీరియాడిక్ డ్రామా సెట్స్ పైన ఉండగానే, తన 34వ సినిమాను అత్యంత భారీ స్థాయిలో ప్రకటించారు. ఈ సినిమా ప్రకటన ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ప్రాజెక్టు ద్వారా ఇండస్ట్రీలో టాప్ యాక్షన్ కొరియోగ్రాఫర్‌గా గుర్తింపు పొందిన వి. వెంకట్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. గోపీచంద్ బాడీ లాంగ్వేజ్‌కు తగినట్టుగా, ఒక పవర్‌ఫుల్ యాక్షన్ డ్రైవ్‌తో కూడిన కథను వెంకట్ సిద్ధం చేశారు. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ 70ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

ఆసక్తిని రేకెత్తిస్తున్న అనౌన్స్‌మెంట్ పోస్టర్

సినిమాపై అంచనాలను పెంచేలా విడుదల చేసిన పోస్టర్ అత్యంత విభిన్నంగా ఉంది. మండుతున్న సూర్యుడు, నారింజ రంగు ఆకాశం మధ్య ఒక రాతి కొండపై గంభీరంగా నిలబడ్డ నల్ల చిరుత ఈ పోస్టర్‌లో హైలైట్‌గా నిలిచింది. చిరుత పులి శరీరంపై మెరుస్తున్న వింత గుర్తులు చూస్తుంటే, సినిమా కథలో ఏదో పురాతన రహస్యం లేదా మైథలాజికల్ టచ్ ఉండబోతోందని అర్థమవుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఆదివారం ఘనంగా జరగనున్నాయి. ప్రీ-ప్రొడక్షన్ పనులు ముగించుకుని, త్వరలోనే రెగ్యులర్ షూటింగ్‌కు వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు. పవర్‌ఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్‌తో రూపొందనున్న ఈ సినిమా గోపీచంద్ కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలుస్తుందని మేకర్స్ చెబుతున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story