Grand Launch of ‘Jai Hanuman’: అంజనాద్రిలో గ్రాండ్ గా జై హనుమాన్ ప్రారంభం
జై హనుమాన్ ప్రారంభం

Grand Launch of ‘Jai Hanuman’: రిషబ్ శెట్టి హీరోగా ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో ‘హనుమాన్’కు సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న చిత్రం ‘జై హనుమాన్’. టీ సిరీస్ సమర్పణలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని హనుమంతుడి జన్మస్థలంగా భావించే విజయనగరం హంపిలోని అంజనాద్రి బెట్టలో ఆదివారం పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు.
టీ-సిరీస్ అధినేత భూషణ్ కుమార్ క్లాప్ కొట్టగా, ‘హనుమాన్’ హీరో తేజ సజ్జా తొలి షాట్‌కు గౌరవ దర్శకత్వం వహించాడు. రిషబ్ శెట్టిని హనుమంతుడిగా పరిచయం చేస్తూ ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఆ పాత్రను నిజాయితీగా ఆవిష్కరించేందుకు ఆయన ఇంటెన్స్ ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్ అయ్యారు. ఈ చిత్రం కలియుగం నేపథ్యంలో రూపొందుతున్న హై-ఆక్టేన్ యాక్షన్ ఎపిక్ అని మేకర్స్ తెలియజేశారు. హనుమంతుడి మౌనం ఓటమి కాదు, ఒక లక్ష్యంతో కూడిన నిశ్చలత అని, సమయం వచ్చినప్పుడు వెలుగులోకి వచ్చే అపార శక్తిని ప్రతిబింబిస్తుంది, అచంచల భక్తి, విశ్వాసం, శాశ్వత బలానికి నివాళిగా ఈ సినిమా నిలవనుందని అని అన్నారు. త్వరలోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

