​‘Ramayana’ Trailer: భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో, ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పౌరాణిక దృశ్యకావ్యం 'రామాయణం' (Ramayana: Part 1) సరికొత్త సంచలనానికి సిద్ధమైంది. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితేష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ విజువల్ వండర్ థియేట్రికల్ ట్రైలర్‌ను జూలై 18న దేశ రాజధాని న్యూఢిల్లీలోని ప్రతిష్టాత్మక 'భారత్ మండపం'లో గ్రాండ్‌గా విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సర్వం సిద్ధం చేస్తోంది. అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లోబల్ మార్కెటింగ్‌ స్ట్రాటజీని ఫాలో అవుతూ, సినిమా విడుదలకు దాదాపు మూడున్నర నెలల ముందే ప్రమోషన్స్ హోరెత్తించేలా మేకర్స్ ఈ భారీ ఈవెంట్‌ను ప్లాన్ చేశారు.

​ఈ మెగా ఈవెంట్‌లో శ్రీరాముడిగా నటిస్తున్న రణబీర్ కపూర్, సీతగా కనిపిస్తున్న సౌత్ స్టార్ సాయి పల్లవితో పాటు లక్ష్మణుడి పాత్రధారి రవి దూబే, శూర్పణఖగా నటిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ వంటి ప్రముఖ తారాగణమంతా ఒకే వేదికపై సందడి చేయనున్నారు. అయితే రావణుడిగా నటిస్తున్న రాకింగ్ స్టార్ యశ్, హనుమంతుడిగా నటిస్తున్న సన్నీ డియోల్ ఈ కార్యక్రమానికి హాజరవుతారా లేదా అనేది ఇంకా అధికారికంగా ఖరారు కాలేదు. గ్లోబల్ వైడ్‌గా భారీ హైప్ క్రియేట్ చేస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ విజేతలు ఏఆర్ రెహమాన్, హన్స్ జిమ్మర్ కలిసి సంగీతాన్ని అందిస్తుండటం సినిమాకు మరో పెద్ద అసెట్. దీపావళి కానుకగా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకు సంబంధించి, జూలై 18న రాబోతున్న ట్రైలర్ ఇండియన్ సినీ లవర్స్‌కు సరికొత్త విజువల్ ట్రీట్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story