ఆంధ్ర కింగ్ తాలూకా ట్రైలర్ రిలీజ్

Andhra King Released: ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న 'ఆంధ్ర కింగ్ తాలూకా' సినిమా ట్రైలర్ విడుదల అయింది. ట్రైలర్ లాంచ్‌ను కర్నూలులోని ఔట్‌డోర్ స్టేడియంలో భారీ ఈవెంట్గా నిర్వహించారు.

తెలుగు సినిమా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా, ట్రైలర్ విడుదల సందర్భంగా డ్రోన్ షోను కూడా ఏర్పాటు చేశారు. ఈ ట్రైలర్‌కు అభిమానుల నుంచి మంచి స్పందన లభించినట్లుగా తెలుస్తోంది.

ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల తేదీని ఒక రోజు ముందుకు మార్చారు. ముందుగా నవంబర్ 28న విడుదల చేయాలని నిర్ణయించారు .ప్రేక్షకులకు నాలుగు రోజుల సుదీర్ఘ వీకెండ్‌ను అందించడం ద్వారా (గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం) సినిమాకు భారీ ఓపెనింగ్స్ వచ్చేలా వ్యూహాత్మకంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. నవంబర్ 27న రామ్ అభిమానులకు పండుగ వాతావరణం నెలకొనే అవకాశం ఉంది.

నర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (ప్రధాన పాత్రలో), భాగ్యశ్రీ బోర్సే (హీరోయిన్). కన్నడ స్టార్ ఉపేంద్ర కీలక పాత్రలో (ఒక స్టార్ హీరోగా) కనిపించనున్నారు.దర్శకుడు మహేశ్ బాబు .పి డైరెక్షన్ వహిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. వివేక్-మెర్విన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమా ఒక స్టార్ హీరోను పిచ్చిగా అభిమానించే ఒక ఫ్యాన్ బయోపిక్ గా రూపొందించబడింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story