బయోపిక్‌ ఫస్ట్ లుక్ రిలీజ్ !

Gummadi Narsaiah Biopic: నిరాడంబర జీవితం గడిపే ప్రజా నాయకుడు, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న 'గుమ్మడి నర్సయ్య' బయోపిక్‌ ఫస్ట్ లుక్ విడుదలైంది. ఈ చిత్రంలో గుమ్మడి నర్సయ్య పాత్రలో కన్నడ కరుణాడ చక్రవర్తి డాక్టర్ శివ రాజ్‌కుమార్ నటిస్తుండటం విశేషం. చిత్ర బృందం విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్, మోషన్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఎమ్మెల్యేలు కార్లలో అసెంబ్లీకి వస్తుంటే, గుమ్మడి నర్సయ్య పాత్రధారి శివరాజ్‌కుమార్ మాత్రం ఎంతో సాధారణంగా, సైకిల్‌ను తోసుకుంటూ అసెంబ్లీ ప్రాంగణంలోకి నడుచుకుంటూ వస్తున్న దృశ్యం పోస్టర్‌లో ఉంది. తెలుగు రాష్ట్రాల్లో పేద ప్రజల పక్షపాతిగా, అత్యంత నిరాడంబరమైన రాజకీయ నాయకుడిగా గుమ్మడి నర్సయ్యకు మంచి పేరుంది. ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా ఆయన సాధారణ జీవితాన్ని గడపడం అందరికీ ఆదర్శం. ఆయన జీవిత కథను వెండితెరపైకి తీసుకురావడంలో భాగంగా, ఆ పాత్రలో శివ రాజ్‌కుమార్ ఒదిగిపోయినట్టుగా ఫస్ట్ లుక్‌లో కనిపిస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలని చిత్ర బృందం యోచిస్తోంది. ఈ ఫస్ట్ లుక్‌తో సినిమాపై అంచనాలు పెరిగాయి. గుమ్మడి నర్సయ్య ఆదర్శవంతమైన జీవిత ప్రయాణాన్ని వెండితెరపై చూడాలని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.పరమేశ్వర్ హివ్రాలే దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రవల్లిక ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్‌పై ఎన్. సురేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. త్వరలో సినిమా విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story