Shah Rukh Khan: బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ కథానాయకుడిగా నటిస్తున్న సరికొత్త భారీ యాక్షన్ థ్రిల్లర్ కింగ్. పఠాన్ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ రూపొందిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ ప్రాజెక్ట్ నుంచి షారుక్ ఖాన్ సరికొత్త, స్టైలిష్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేయడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ తాజా పోస్టర్‌లో షారుక్ ముఖంపై రక్తపు గాయాలు, చేతిలో గన్, పెదవుల మధ్య ఎర్రటి గులాబీ పువ్వుతో కనిపించి అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నారు. ‘‘ఈరోజు నాకు మళ్లీ గుర్తొచ్చింది.. నేను హంతకుడిని కాదు, ప్రేమికుణ్ని’’ అంటూ సాగే డైలాగ్‌తో వచ్చిన ఈ లుక్.. సినిమాలో హై-వోల్టేజ్ యాక్షన్‌తో పాటు హృదయాన్ని హత్తుకునే రొమాంటిక్ అంశాలు సమపాళ్లలో ఉండబోతున్నాయని స్పష్టం చేస్తోంది.

ఈ చిత్రంలో షారుక్ సరసన దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తుండగా, షారుక్ కుమార్తె సుహానా ఖాన్ కీలక పాత్రలో మెరవనున్నారు. వీరితో పాటు అభిషేక్ బచ్చన్, అనిల్ కపూర్, రాఘవ్ జుయల్ తదితరులు ముఖ్య పాత్రల్లో సందడి చేయనున్నారు. రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్, మార్ఫ్లిక్స్ పిక్చర్స్ బ్యానర్లపై గౌరీ ఖాన్, సిద్ధార్థ్ ఆనంద్, మమతా ఆనంద్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు ఈ యాక్షన్ డ్రామా క్రిస్మస్ కానుకగా డిసెంబరు 24న విడుదల కానుంది.

Next Story