వైరల్ అవుతున్న వీడియో!

Actress Hansika Motwani: టాలీవుడ్, కోలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితురాలైన నటి హన్సిక మోత్వాని ఇటీవల వార్తల్లో నిలుస్తోంది. తన వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులను ఎదుర్కొన్న హన్సిక, భర్త సోహైల్‌తో అధికారికంగా విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ముంబై కోర్టు వీరికి విడిపోయేందుకు అనుమతినివ్వడంతో, హన్సిక ప్రస్తుతం తన కెరీర్‌పై పూర్తి దృష్టి సారించింది.

తాజాగా ముంబైలో జరిగిన ఒక ప్రైవేట్ పార్టీకి హన్సిక హాజరయ్యారు. ఎప్పటిలాగే చిరునవ్వుతో పాపరాజీలకు అభివాదం చేస్తూ ఫోటోలకు ఫోజులిచ్చారు. అయితే, అక్కడే ఒక ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. హన్సిక అక్కడి నుండి వెనుతిరిగి వెళ్తున్న సమయంలో, ఫోటోగ్రాఫర్లు ఆమెను వెనుక వైపు నుండి చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో హన్సిక అసహనానికి గురై, తన చేతులతో సైగ చేస్తూ తనను వెనుక నుండి షూట్ చేయవద్దని సున్నితంగా హెచ్చరించారు. ఆమె ముఖకవళికలు చూస్తుంటే ఆ యాంగిల్స్‌లో ఫోటోలు తీయడం పట్ల ఆమె అసౌకర్యంగా ఉన్నట్లు స్పష్టమైంది.

ఇటీవల కాలంలో హీరోయిన్లు కెమెరా యాంగిల్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. కొద్దిరోజుల క్రితం నటి మృణాల్ ఠాకూర్ కూడా ముంబైలో ఒక ఈవెంట్లో ఇలాగే ఫోటోగ్రాఫర్లకు వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు, నటి సమంత మాత్రం పాపరాజీలతో సరదాగా గడుపుతూ, అటువంటి ఫోజులకు కూడా ఇబ్బంది లేకుండా నవ్వుతూ సహకరించడం గమనార్హం.

సినిమాల విషయానికి వస్తే, హన్సిక ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందుతున్న ఒక తెలుగు వెబ్ డ్రామాలో కీలక పాత్ర పోషిస్తోంది. విడాకుల తర్వాత ఆమె మళ్లీ బిజీగా మారుతూ తన సెకండ్ ఇన్నింగ్స్‌ను గ్రాండ్‌గా ప్లాన్ చేసుకుంటోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story