ఫిలిం ఛాంబర్‌లో పరస్పరం ఫిర్యాదు

Hanuman Director vs Producer : హనుమాన్ సినిమాతో దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇప్పుడు ఒక పెద్ద వివాదంలో చిక్కుకున్నారు. నిర్మాత నిరంజన్ రెడ్డితో ఆయనకు ఉన్న ఆర్థికపరమైన అంశాలపై ఇద్దరూ ఫిలిం ఛాంబర్ మెట్లు ఎక్కడం హాట్ టాపిక్‌గా మారింది. హనుమాన్' తర్వాత ప్రశాంత్ వర్మ తమ బ్యానర్‌లోనే అధీర, మహాకాళీ, జై హనుమాన్, బ్రహ్మరాక్షస వంటి సినిమాలు చేస్తానని చెప్పి రూ.10.34 కోట్లు అడ్వాన్స్ తీసుకున్నారని నిరంజన్ రెడ్డి ఆరోపించారు. ఆ సినిమాలు చేయడం ఆలస్యం అవుతున్నందున, తమకు జరిగిన నష్టానికిగానూ ప్రశాంత్ వర్మ నుంచి రూ.200 కోట్ల నష్టపరిహారం కావాలని నిరంజన్ రెడ్డి ఫిర్యాదులో కోరారు.

నిరంజన్ రెడ్డి చేస్తున్న పనుల వల్లే తనకు నష్టాలు, కెరీర్‌కు దెబ్బ తగిలిందని ప్రశాంత్ వర్మ కూడా ఫిలిం ఛాంబర్‌కు లేఖ రాశారు. ఆయన చెప్పినట్లు తాను ఎటువంటి అగ్రిమెంట్ లేకుండా అడ్వాన్స్‌లు తీసుకోలేదని, ఆ నాలుగు సినిమాలు ఆయనతోనే చేస్తానని చెప్పలేదని వర్మ అంటున్నారు. హనుమాన్' సినిమా రూ.295 కోట్లు వసూలు చేయగా, ఆ లాభాల నుంచి తనకు రావాల్సిన వాటాను ఎగ్గొట్టేందుకే నిరంజన్ రెడ్డి ఈ డ్రామా చేస్తున్నారని, ఇప్పటివరకు తనకు కేవలం రూ.15.82 కోట్లు మాత్రమే ఇచ్చారని ప్రశాంత్ వర్మ తెలిపారు.

"ప్రస్తుతం ఈ వివాదం ఫిలిం ఛాంబర్, డైరెక్టర్స్ అసోసియేషన్ వద్ద పెండింగ్‌లో ఉంది. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలు, అసంపూర్ణమైన సమాచారం. నాపై చేసిన ఆరోపణలు ప్రతీకారంతో చేస్తున్నట్లు కనిపిస్తోంది. తుది తీర్పు వచ్చే వరకు అందరూ వేచి ఉండండి" అని ప్రశాంత్ వర్మ మీడియాకు విజ్ఞప్తి చేశారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story