Hanuman Junction: జూన్ 28న హనుమాన్ జంక్షన్ రీ రిలీజ్
హనుమాన్ జంక్షన్ రీ రిలీజ్
Hanuman Junction: ఈ మధ్య టాలీవుడ్ లో రీ రిలీజ్ ల పర్వం కనసాగుతోంది. హిట్ సినిమాలను మళ్లీ థియేటర్లో రిలీజ్ చేస్తున్నారు. వారానికో సినిమా థియేటర్లోకి వస్తుంది. ఇప్పటి వరకు చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇపుడు ఈలిస్ట్ లో సూపర్ హిట్ మూవీ హనుమాన్ జంక్షన్ చేరింది. జూన్ 28న థియేటర్లో సందడి చేయనుంది
అర్జున్, జగపతి బాబు, వేణు హీరోలుగా లయ, స్నేహ హీరోయిన్స్ గా నటించిన చిత్రం 'హనుమాన్ జంక్షన్'. మోహన్ రాజా ఈ చిత్రంతో దర్శ కుడిగా పరిచయమయ్యాడు. ఎడిటర్ మోహన్ స్థాపించిన ఎం.ఎల్. మూవీ ఆర్ట్స్ బ్యానర్పై ఎం.వి.లక్ష్మి ఈ చిత్రాన్ని నిర్మించారు. 2001లో విడుదలైన ఈ చిత్రం అప్పట్లో బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సాధించింది. తాజాగా ఈ చిత్రాన్ని జూన్ 28న రీరిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు.
ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే , ఆకట్టుకునే డైలాగ్స్, కామెడీ, యాక్షన్ సన్నివేశాలు సినిమాకు మంచి సక్సెస్ను తీసుకొచ్చాయి. బ్రహ్మానందం, కోవై సరళ, అలీ, ఎల్.బి. శ్రీరామ్, ఎం. ఎస్. నారాయణ, వేణు మాధవ్ హాస్య పాత్రల తో ప్రేక్షకులను అలరించారు. ఈ ఎవర్ గ్రీన్ ఎంటర్టైనర్ మళ్లీ ప్రేక్షకు లను థియేటర్ లో అలరించనుందని దర్శక నిర్మాతలు తెలియజేశారు.
