రీమేక్ రూమర్లపై హరీశ్ శంకర్ సంచలన వ్యాఖ్యలు..

Harish Shankar: పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, మాస్ డైరెక్టర్ హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుండి ఇది విజయ్ నటించిన తెరి చిత్రానికి రీమేక్ అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ ఆరోపణలపై హరీశ్ శంకర్ గట్టిగా స్పందిస్తూ.. అసలు నిజాన్ని బయటపెట్టారు.

రీమేక్ అయితే గర్వంగా చెబుతా

హరీశ్ శంకర్ మాట్లాడుతూ.. ‘‘తాను ఏదైనా సినిమాను రీమేక్ చేస్తే దాచుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. గబ్బర్ సింగ్ సినిమా క్రెడిట్స్ లో మాటలు, మార్పులు, దర్శకత్వం అని నిజాయతీగా వేసుకున్నాను. ఆ ధైర్యాన్ని చూసి రాజమౌళి కూడా నన్ను మెచ్చుకున్నారు. ఒకవేళ ఉస్తాద్ భగత్ సింగ్ రీమేక్ అయితే టైటిల్ కార్డ్స్‌లో కథ అని నా పేరు ఎందుకు వేసుకుంటాను?’’ అని ఆయన ప్రశ్నించారు.

గబ్బర్ సింగ్ సీన్‌నే వాళ్లు వాడారు..

రీమేక్ ఆరోపణలను తిప్పికొడుతూ హరీశ్ శంకర్ ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు.

అంత్యాక్షరి ఎఫెక్ట్: గబ్బర్ సింగ్ లో తాను సృష్టించిన ఐకానిక్ అంత్యాక్షరి సీన్‌ను స్ఫూర్తిగా తీసుకునే.. తెరి సినిమాలో రౌడీలతో రైమ్స్ చెప్పించే సీన్ పెట్టారని ఆయన ఆరోపించారు. "నా సినిమాలోని సీన్‌ను వాళ్లు వాడుకుంటే, ఇప్పుడు నేను ఆ సినిమానే రీమేక్ చేస్తున్నానని అనడం ఎంతవరకు కరెక్ట్?" అంటూ అసహనం వ్యక్తం చేశారు. పోలీస్ కథల్లో హీరో రౌడీలను ఎదిరించడం సహజమని, తెరి, టెంపర్ వంటి సినిమాలు కూడా ఆ కోవకే చెందుతాయని ఆయన వివరించారు.

గబ్బర్ సింగ్ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత పవన్ - హరీశ్ కాంబోలో వస్తున్న రెండో సినిమా కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. పవన్ కల్యాణ్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తుండగా, శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ నెల 26న సినిమా థియేటర్లలో సందడి చేయనుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story