ఇలియానా జన్మనిచ్చిందా?

టాలీవుడ్లో దాదాపు అందరు స్టార్ హీరోలతో కలిసి నటించింది బ్యూటీ ఇలియానా. తర్వాత బాలీవుడ్ లోనూ నటించిందీ అమ్మడు. పోలీసుకి చెందిన వ్యాపార వేత్త మైఖేల్ డోలన్ ను పెళ్లాడిందీ అమ్మడు. ఈ జంటకి ఆగస్టు 2023 సంవత్సరంలో కొడుకు పుట్టాడు. ఇక ఇటీవల ఆమె రెండోసారి కూడా తల్లి కాబోతోందని వార్తలొచ్చాయి. అయితే ఫాదర్స్ డే సందర్భంగా తన భర్త డోలన్ పసికందును ముద్దాడు తున్న ఫొటోను ఇలియానా షేర్ చేసింది. ఆ బిడ్డ కొత్తగా పుట్టినట్టుగా కనిపించడంతో నెటిజన్లు 'ఇలియానా రెండో బిడ్డకు జన్మనిచ్చిందా?' అని ప్రశ్నిస్తున్నారు. మరి ఇంకా ఆ బిడ్డ ఆడా..? మగా..? అనే విషయంపై మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా సీక్రెట్గానే ఉంచారు. అభిమానులు మాత్రం అధికారిక ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు. ఇక ఇలియానా కెరీర్ వి షయానికి వస్తే.. తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో నటించి తన మార్క్ వేసింది. ఇటీవల ఆమె 'దో ఔర్ దో ప్యార్' అనే హిందీ చిత్రంలో కనిపించిం ది. అయితే ప్రెగ్నెన్సీ కారణంగా ఆమె 'రైడ్ 2' వంటి పెద్ద అవకాశాలను వదులుకోవాల్సి వచ్చింది.

Updated On 19 Jun 2025 5:39 PM IST
PolitEnt Media

PolitEnt Media

Next Story