జాన్ అబ్రహం నటనపై రిమీ సేన్ సంచలన వ్యాఖ్యలు..

Rimi Sen’s Sensational Comments: చాలా కాలం తర్వాత సోషల్ మీడియాలో మెరిసిన రిమీ సేన్, ఒకప్పుడు తనతో కలిసి నటించిన స్టార్ హీరో జాన్ అబ్రహం సినీ ప్రయాణంపై కీలక వ్యాఖ్యలు చేశారు. జాన్ అబ్రహం కెరీర్ ప్రారంభంలో ఒక మోడల్ అని, అప్పట్లో ఆయనకు నటన పెద్దగా తెలియదని రిమీ అన్నారు. అయితే తన పరిమితులను గుర్తించి, నటన కంటే తన బాడీ, లుక్స్‌కు ప్రాధాన్యత ఉండే పాత్రలను ఎంచుకోవడమే ఆయన చేసిన తెలివైన పని అని ఆమె అభిప్రాయపడ్డారు. తన నటనపై విమర్శలు వచ్చినా కుంగిపోకుండా, యాక్షన్ సినిమాలకే ప్రాధాన్యత ఇచ్చి ప్రేక్షకులకు నచ్చేలా తనను తాను మలచుకున్నారని చెప్పారు. అందుకే ఆయన్ని "చాలా తెలివైన నటుడు" అని ఆమె ప్రశంసించారు.

ఒకసారి గుర్తింపు వచ్చిన తర్వాత, కెమెరా ముందు గడిపిన అనుభవంతో జాన్ తన నటనను కూడా మెరుగుపరుచుకున్నారని, ఆ తర్వాతే నటనకు స్కోప్ ఉన్న పాత్రలు చేశారని రిమి సేన్ వెల్లడించారు. కేవలం నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా జాన్ అబ్రహం సక్సెస్ సాధించారని, కంటెంట్ ఉన్న సినిమాలను నిర్మిస్తూ మంచి బిజినెస్‌మ్యాన్‌గా ఎదిగారని రిమీ కొనియాడారు.

దుబాయ్‌లో రిమీ సేన్ కొత్త ప్రయాణం

సినిమాలకు ఎందుకు దూరమయ్యారనే ప్రశ్నకు స్పందిస్తూ.. తాను దుబాయ్‌లో రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్‌గా స్థిరపడ్డానని ఆమె తెలిపారు. భారత దేశంలో వ్యాపార నిబంధనలు తరచుగా మారుతుంటాయని, కానీ దుబాయ్‌లో సిస్టమ్ చాలా పారదర్శకంగా ఉంటుందని అందుకే అక్కడ సెటిల్ అయ్యానని ఆమె చెప్పుకొచ్చారు.

జాన్ అబ్రహం లేటెస్ట్ అప్‌డేట్స్

మరోవైపు జాన్ అబ్రహం వరుస యాక్షన్ చిత్రాలతో బిజీగా ఉన్నారు. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన టెహ్రాన్ స్పై యాక్షన్ థ్రిల్లర్ మంచి స్పందన పొందింది. ప్రస్తుతం అరుణ్ గోపాలన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ దేశభక్తి నేపథ్య చిత్రంలో ఆయన నటిస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story