Hema Malini’s Emotional Post: నా సర్వస్వం ఆయనే..హేమమాలిని భావోధ్వేగ పోస్ట్
హేమమాలిని భావోధ్వేగ పోస్ట్

Hema Malini’s Emotional Post: బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర ఇటీవల కన్నుమూయడంతో, ఆయన సతీమణి, నటి, రాజకీయవేత్త హేమ మాలిని తీవ్ర భావోద్వేగంతో వ్యాఖ్యలు చేస్తూ సంతాప సందేశాన్ని విడుదల చేశారు.
నవంబర్ 27, 2025న, హేమ మాలిని తన సోషల్ మీడియా వేదిక ద్వారా ధర్మేంద్ర రి జ్ఞాపకార్థం ఒక సుదీర్ఘమైన, భావోద్వేగపూరితమైన లేఖను పంచుకున్నారు." ధర్మేంద్ర తన జీవితంలో అన్నీ అని, ఆయన ఒక ప్రేమగల భర్త, ఇద్దరు కూతుళ్లు (ఈషా, అహానా)కు ఆరాధించే తండ్రి, స్నేహితుడు, తత్వవేత్త, మార్గదర్శి, కవి అని తెలిపారు.మంచి సమయాల్లోనూ, చెడు సమయాల్లోనూ ఆయన నాకు ఎప్పుడూ తోడుగా ఉన్నారు" అని తెలిపారు.
తన సరళమైన, స్నేహపూర్వక ప్రవర్తనతో ధర్మేంద్ర తన కుటుంబ సభ్యులందరికీ ఎంతో చేరువయ్యారని, అందరి పట్ల ప్రేమ, ఆప్యాయత చూపేవారని గుర్తు చేసుకున్నారు.ఒక పబ్లిక్ పర్సనాలిటీగా, ఆయన ప్రతిభ, ప్రజాదరణ ఉన్నప్పటికీ ఆయనలో ఉన్న వినయం,సర్వజనామోదం ఆయనను ఇతర దిగ్గజాల నుంచి వేరు చేశాయని కొనియాడారు.
"నా వ్యక్తిగత నష్టం మాటలకు అందనిది, ఆ ఏర్పడిన శూన్యత (Vacuum) నా జీవితాంతం ఉంటుంది" అని హేమ మాలిని తీవ్ర దుఃఖాన్ని వ్యక్తం చేశారు."ఇన్నేళ్ల మా బంధం తర్వాత, ఎన్నో ప్రత్యేక క్షణాలను గుర్తుచేసుకోవడానికి అసంఖ్యాకమైన జ్ఞాపకాలు మిగిలాయి" అని తెలిపారు.

