సిద్ధూ జొన్నలగడ్డ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Siddu Jonnalagadda’s Interesting Comments: డీజే టిల్లు హీరో సిద్ధు జొన్నలగడ్డ తాజా చిత్రం తెలుసు కదా అక్టోబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. రొమాంటిక్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ చిత్రంలో రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటించారు. నీరజ కోన దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్, టీజీ కృతీప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు.

సినిమా విడుదల ఒక్క రోజు ముందు ఉండటంతో, హీరో సిద్ధు జొన్నలగడ్డ సరదాగా నెటిజన్లతో ముచ్చటించారు. ఆయన ట్విట్టర్ వేదికగా ఆస్క్ సిద్దు పేరుతో అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానాలు ఇచ్చారు. ఈ చిట్-చాట్‌లో నెటిజన్లు ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోల గురించి ప్రశ్నలు అడిగారు. మీ ఫేవరెట్ హీరో ఎవరు?' అని అడిగిన ప్రశ్నకు సిద్ధు జొన్నలగడ్డ బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్ అని ఆన్సర్ ఇచ్చారు.

అంతేకాకుండా, రణ్‌బీర్ కపూర్‌తో త్వరలోనే ఫ్యాన్ బాయ్ మూమెంట్ జరగనుందని రిప్లై ఇచ్చి మరింత ఆసక్తి పెంచారు. తెలుసు కదా సినిమా ట్రైలర్‌తో ఇప్పటికే అంచనాలు పెంచగా, సిద్ధు చేసిన ఈ చిట్-చాట్‌తో సినిమాపై మరింత హైప్ క్రియేట్ అయ్యింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story