Vijay Deverakonda: కారు ప్రమాదంపై విజయ్ దేవరకొండ ఏమన్నారంటే..?
విజయ్ దేవరకొండ ఏమన్నారంటే..?

Vijay Deverakonda: టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రయాణిస్తున్న కారు స్వల్ప రోడ్డు ప్రమాదానికి గురైంది. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి సమీపంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదం నుంచి విజయ్ దేవరకొండ సురక్షితంగా బయటపడ్డారు. విజయ్ ప్రయాణిస్తున్న కారును బొలెరో వాహనం ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కారు స్వల్పంగా దెబ్బతిన్నట్లు సమాచారం. ప్రమాదం తర్వాత విజయ్ మరో కారులో హైదరాబాద్‌కు బయలుదేరారు.
ట్వీట్‌తో అభిమానులకు భరోసా
ఈ వార్త బయటికి రావడంతో అభిమానులు ఆందోళన చెందారు. దీనిపై విజయ్ దేవరకొండ స్వయంగా తన సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ‘‘అంతా బాగానే ఉంది. కారు దెబ్బతిన్నప్పటికీ, మాకెవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. నేను ఇప్పుడే వ్యాయామం చేసి ఇంటికి తిరిగి వచ్చాను. నా గురించి ఆరా తీసిన మీ అందరికీ లవ్ యూ’’ అంటూ తన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రమాదం నుంచి విజయ్ దేవరకొండ క్షేమంగా ఉన్నారని తెలియడంతో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
