హీరో ఆది సాయి కుమార్

Hero Aadi Sai Kumar: టాలీవుడ్ హీరో ఆది సాయి కుమార్ మరోసారి తండ్రి అయ్యారు. జనవరి 2న ఆయన భార్య అరుణ మగ బిడ్డకు జన్మనిచ్చారని సినీ వర్గాలు తెలిపాయి. చాలా కాలం తర్వాత ‘శంబాల’తో హిట్ అందుకున్న ఆయనకు సంతోషం రెట్టింపు అయింది. 2014లో ఆది, అరుణ వివాహం జరగ్గా, వారికి ఓ పాప ఉంది. కాగా శంబాల మూవీ వారం రోజుల్లో రూ.16.2 కోట్ల గ్రాస్ వసూళ్లు అందుకున్నట్లు మేకర్స్ ప్రకటించారు. చాలా ఏళ్ల తర్వాత శంబాల మూవీతో ఆది సాయికుమారు భారీ విజయాన్ని అందుకున్నారు. యుగంధర్‌ ముని దర్శకత్వం వహించిన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. క్రిస్‌మస్‌ కానుకగా డిసెంబర్‌ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం కేవలం వారం రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.16.20 కోట్ల గ్రాస్‌ రాబట్టింది. ఆది కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్స్‌ రాబట్టిన చిత్రంగా శంబాల రికార్డ్‌ క్రియేట్‌ చేసింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story