నేనెప్పుడూ చూడలేదు

Hero Dixit Shetty: దీక్షిత్ శెట్టి 'దసరా' సినిమాలో తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటిస్తున్న 'ది గర్ల్ ఫ్రెండ్' సినిమాలో హీరోగా నటిస్తున్న దీక్షిత్ శెట్టి ఈ చిత్రం గురించి ఇటీవల ప్రమోషన్లలో సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు . ది గర్ల్ ఫ్రెండ్' నా కెరీర్‌లోనే బెస్ట్ ఫిల్మ్ అని గట్టిగా నమ్ముతున్నాను. ఈ సినిమా నా కెరీర్‌కి టర్నింగ్ పాయింట్ అవుతుంది. నేను అనేక భాషల్లో కథలు వింటున్నాను. 'ది గర్ల్ ఫ్రెండ్' లాంటి స్క్రిప్ట్‌లు చాలా అరుదుగా వస్తుంటాయి. కథ నాకు వ్యక్తిగతంగా చాలా నచ్చింది. అందుకే ఈ సినిమాను తప్పకుండా చేయాలని అనుకున్నాను."

"విక్రమ్ (తన పాత్ర పేరు) ఒక చాలా లేయర్స్ ఉన్న పాత్ర. ట్రైలర్ చూసి కొందరు అతను 'టాక్సిక్ బాయ్‌ఫ్రెండ్' అని అనుకుంటున్నారు. కానీ, అతనిలో నెగెటివ్ కోణం మాత్రమే కాదు, అతని భావోద్వేగాలు, మనసులోని సంఘర్షణలు వేరుగా ఉంటాయి."దర్శకుడు రాహుల్ రవీంద్రన్ విక్రమ్ పాత్రపై పూర్తి క్లారిటీ ఉంది. ఆయన చెప్పిన విధంగా ఆ పాత్రను పోషించడం నాకు సులభమైంది. నేను ఈ పాత్ర కోసం చాలా ప్రిపేర్ అయ్యాను.""మనం ఇప్పటివరకు చూసిన ప్రేమ కథా చిత్రాలకు భిన్నంగా, 'ది గర్ల్ ఫ్రెండ్' ప్రేమ కథను మరో కోణంలో చూపిస్తుంది.""ఈ సినిమాలోని పాత్రలు, సందర్భాలు మన రియల్ లైఫ్‌తో రిలేట్ చేసుకునేలా ఉంటాయి. ఈ సినిమా చూశాక ప్రేక్షకులు కేవలం ఎంటర్‌టైన్ అవ్వడమే కాకుండా, ఏదో ఒకటి గుర్తుపెట్టుకొని తీసుకెళ్తారు."

ముఖ్యంగా 18 నుంచి 25 ఏళ్ల యూత్ ఈ సినిమా చూస్తే తమ లైఫ్‌లో కొన్ని విషయాలు నేర్చుకుంటారు."రష్మిక (భూమా పాత్ర) తెరపై కనిపించగానే ఆ పాత్రలోకి పూర్తిగా ఒదిగిపోయింది. ఆమె పర్‌ఫార్మెన్స్ ఈ సినిమాలో హైలైట్ అవుతుంది. ఇంతకంటే ఏ నాయిక కూడా ఈ పాత్రకు న్యాయం చేయలేదేమో అనిపించింది."ఈ సినిమా నవంబర్ 7న తెలుగు మరియు హిందీ భాషల్లో విడుదల కానుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story