నా కెరీర్ లో భారీ బడ్జెట్ మూవీ

Hero Teja Sajja: తేజ సజ్జా హీరోగా తెరకెక్కుతున్న 'మిరాయ్' సెప్టెంబర్ 12న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లో రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా చెన్నైలో మాట్లాడిన హీరో తేజా సజ్జ సినిమా గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు . యాక్షన్,అడ్వెంచర్ ఫాంటసీ,డివోషన్,ఎమోషన్ అన్నీ కలకలిపిన సినిమా మిరాయ్ అని చెప్పాడు. ఫ్యామిలీ అంతా కలిసి థియేటర్లో చూడదగిన సినిమా అని అన్నాడు. డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని విజన్ వల్లే ఈ సినిమా సాధ్యమైందన్నాడు.

జపనీస్ భాషలో 'మిరాయ్' అంటే 'భవిష్యత్తు' అని అర్థం. ఈ సినిమా కథాంశం భారతదేశంలో 2000 సంవత్సరాల క్రితం జరిగిన ఒక సంఘటన ఆధారంగా రూపొందించబడింది.ఈ సినిమా కథ, కథనం అత్యంత కొత్తగా, వినూత్నంగా ఉంటాయని తేజ సజ్జా తెలిపారు. ఒకప్పుడు భారత్ లోని ప్రజలు గ్రహాంతరవాసులతో మాట్లాడేవారని, ఈ విషయంపై పూర్తి పరిశోధన చేసి కథను సిద్ధం చేశారని చెప్పారు.'మిరాయ్' సినిమా తన కెరీర్‌లోనే భారీ బడ్జెట్ చిత్రం అని అన్నారు.

ఈ సినిమా కోసం స్పెషల్ టెక్నాలజీ, గ్రాఫిక్స్ ఉపయోగించారని, ఈ మూవీ సినిమాటోగ్రఫీ, గ్రాఫిక్స్ విజువల్‌గా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని వివరించారు.ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో కూడా విడుదల కానుంది. మంచు మనోజ్ విలన్ గా ,జగపతి బాబు కీలకపాత్రలో నటిస్తున్నారు. హనుమాన్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వస్తోన్న మిరాయ్' సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story