మానసికంగా కుంగిపోయా

Heroine Mamata Mohandas: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీ యమదొంగ ఆర్ మూవీతో టాలీవుడ్లో క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ మమతా మోహన్ దాస్, అయితే కెరీర్ మంచి ఫాంలో ఉండగానే క్యాన్సర్ బారినపడింది. దాదాపు రెండుసార్లు క్యాన్సర్ తో పోరాడి గెలిచింది. చాలా ఏండ్ల తర్వాత మహారాజా మూవీతో ప్రేక్షకులను వెలకరించింది. విజయ్ సేతుపతి హీరోగా వచ్చిన ఈ సినిమాలో కీలక పాత్రలో మెప్పించింది. అంతేకా కుండా ఇటీవలు రుద్రాంగి సినిమాతో టాలీవుడ్లో రీ ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితంలో జరిగిన ఘటనపై ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

ఒక స్ట్రాంగ్ యాక్టర్తనను ఎలా మోసం చేశాడని తెలిపింది. క్యాన్సర్, బొల్లి వ్యాధి సమస్యలతో సమస్యలతో పోరాడుతున్న సమయం లోనే ప్రేమ, పెండ్లి విషయంలోనూ ఎంతో మానసిక వేదనను అనుభవించానని అంటోంది. 'నాకు డేటింగ్, ప్రేమలో పెద్దగా అనుభవం లేదు. క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధా రణ అయిన తర్వాత, ఒక మహిళగా నా అంచనాలను నెరవేర్చుకోవాలనుకున్న ఆ సమయంలో ఒక ప్రముఖ మలయాళ నటుడు నన్ను డేటింగ్ కోసం అడిగాడు. అందుకు నా తల్లి సైతం నాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ అతడికి అప్పటికే వేరే మహిళతో నిశ్చితార్ధం జరిగింది. ఈ విషయాన్ని నా దగ్గర దాచి పెట్టాడు. అసలు విషయం తెలిసి షాకయ్యాను. తర్వాత నా జీవితంలో మరో వ్యక్తిని కలుసుకున్నాను. కానీ ఈ ప్రేమ, డేటింగ్ అనవసర మని అన్నాడు. ఒకవైపు అనారోగ్యం, మరోవైపు పెండ్లి బంధంలో విడాకులు నన్ను మానసికంగా కుంగదీశాయి' అంటూ మమతా చెప్పుకొచ్చింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story