హీరోయిన్లకు అవకాశాలు రావడం లేదు

Nushrratt Bharuccha: బాలీవుడ్ నటి నుస్రత్ భరుచా సినీ పరిశ్రమలో హీరోల మాదిరిగా హీరోయిన్లకు అవకాశాలు లభించడం లేదని తన అభిప్రాయాన్ని వెల్లడించారు. వైవిధ్యమైన కథలతో ప్రయాణం చేస్తున్న ఆమె, నటీమణులు ఇప్పటికీ హీరోలతో సమాన హోదాను పొందడానికి కష్టపడుతున్నారని పేర్కొన్నారు.

నుస్రత్ భరుచా చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్‌లో లింగ వివక్ష, సమాన అవకాశాల లేమి అనే చర్చను మరోసారి తెరపైకి తెచ్చాయి. అవుట్‌సైడర్‌గా తన సినీ ప్రయాణంలో ఎదుర్కొన్న సవాళ్లను కూడా ఆమె గతంలో పంచుకున్నారు. సెట్స్‌లో సరైన సౌకర్యాలు లేకపోవడం, ప్రయాణ ఏర్పాట్లలో వివక్ష వంటివి ఎదుర్కొన్నానని తెలిపారు. ఒక సందర్భంలో, తాను ఎకానమీ క్లాస్‌లో ప్రయాణించగా, మిగిలిన నటీనటులంతా బిజినెస్ క్లాస్‌లో వెళ్లారని ఆమె గుర్తు చేసుకున్నారు.

హిట్‌ సినిమాలు చేసినప్పటికీ, తనకు తగినన్ని అవకాశాలు రావడం లేదని, స్టార్ కిడ్స్‌కు ఉన్నంత సులభంగా తమకు అవకాశం లభించడం లేదని ఆమె పరోక్షంగా తెలిపారు. అయితే, ఈ వివక్షను ఎదుర్కోవడానికి ఎదురుదాడి కాకుండా, వృత్తిపరంగా ఎదగడంపైనే తాను దృష్టి పెట్టానని నుస్రత్ అన్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story