హిట్ కాంబో రిపీట్ !

Hit Combo: పుష్ప -2 హిట్ తో అల్లుఅర్జున్, రష్మిక మందన్నది హిట్ కాంబినేషన్ గా పేరొచ్చిం ది. అయితే ఈ హిట్ పెయిర్ మరోమారు వెండి తెరపై సందడి చేయబోతున్నట్టు వార్తలొస్తున్నాయి. అట్లీతో అల్లు అర్జున్ చేస్తున్న సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. సన్ పిక్చర్స్ 500 కోట్ల బడ్జెట్ తో ఈ మూవీ నిర్మిస్తున్నారు. ఇప్పటికే అట్లీ, అల్లు అర్జున్ సినిమాలో ఒక హీరోయిన్ గా దీపిక పదుకొనెని లాక్ చేశారు. దీపిక సినిమాలో చాలా పవర్ ఫుల్ రోల్ చే స్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఆమెతో పాటు ఈ మూవీలో మృణాల్ ఠాకూర్ కూడా నటిస్తోంది. జాన్వీకపూర్ ని కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ కి తీసుకున్నార ని టాక్. ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా అవసరం ఉండగా ఆ ఛాన్స్ ని రష్మిక మందన్న కి ఇచ్చారని తెలుస్తోంది. అల్లు అర్జున్ పుష్ప 1, 2 సినిమాలో శ్రీవల్లి పాత్రలో రష్మిక మందన్న నటించింది. వీళ్లిద్దరి జోడీ సూపర్ హిట్ అనిపించు కుంది. వీళ్లిద్దరూ కలిసి పుష్ప 3 కూడా చేయాల్సి ఉన్నా ఈలోగా అట్లీ సినిమాలో రష్మికని తీసుకుంటున్నారట. రష్మిక సెలక్షన్ అల్లు అర్జున్ వల్లే అని అంటున్నారు.
