Allu Arjun’s ‘Raaka’: హాలీవుడ్ రేంజ్ VFX.. అందుకే అల్లు అర్జున్ ‘రాకా’మరింత లేట్!
అల్లు అర్జున్ ‘రాకా’మరింత లేట్!

Allu Arjun’s ‘Raaka’: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. మాస్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న ‘రాకా’ సినిమా గుర్తుందిగా? అనౌన్స్‌మెంట్ రోజే ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఈ మోస్ట్ క్రేజీయెస్ట్ ప్రాజెక్ట్ గురించి ఇప్పుడు ఒక సెన్సేషనల్ అప్‌డేట్ నెట్టింట హల్‌చల్ చేస్తోంది!
సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రజెంట్ శరవేగంగా జరుగుతోంది. అయితే, ఈ మూవీ రిలీజ్ డేట్‌కు సంబంధించి ఫ్యాన్స్‌కు ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. నిజానికి ఈ సినిమాను 2027 ఫస్ట్ క్వార్టర్‌లోనే రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ, ఇప్పుడు ఈ క్రేజీ ప్రాజెక్ట్ మరింత ఆలస్యం కాబోతున్నట్లు ఇండస్ట్రీ టాక్!
ఎందుకంటే.. ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్‌కు అట్లీ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారట. హాలీవుడ్ రేంజ్ వీఎఫ్ఎక్స్ (VFX) అవుట్‌పుట్ కోసం పోస్ట్ ప్రొడక్షన్ పనులకు భారీగా సమయం కేటాయించాలని నిర్మాతలు ఫిక్స్ అయ్యారు. అందుకే.. ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా, 2027 డిసెంబర్ 2న ఈ సినిమాను గ్రాండ్‌గా వరల్డ్ వైడ్‌గా రిలీజ్ చేసేలా పక్కా ప్లాన్ రెడీ చేస్తున్నారట. దీనిపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా రానుంది. దీపికా పదుకొణె హీరోయిన్‌గా, సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ ‘రాకా’.. థియేటర్లలో ఎలాంటి విధ్వంసం సృష్టిస్తుందో చూడాలి.

