Spider-Man: Brand New Day: హాలీవుడ్ సినిమాలు భారతీయ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించడం మనకు కొత్తేమీ కాదు.అవెంజర్స్, అవతార్' వంటి బిగ్గెస్ట్ ఫ్రాంచైజీలతో పాటు, దర్శకుడు క్రిస్టఫర్ నోలన్ సినిమాలకు మన దేశంలో ఊహించని స్థాయిలో అభిమానులు ఉన్నారు. అందుకే ఇక్కడి స్టార్ హీరోల సినిమాలతో పోటీపడుతూ హాలీవుడ్ చిత్రాలు భారీ వసూళ్లను రాబడుతుంటాయి.

అయితే, ఇప్పటివరకు ఏ హాలీవుడ్ సినిమాకూ సాధ్యం కాని రీతిలో, ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఒక చిత్రం తిరుగులేని సరికొత్త చరిత్రను తిరగరాసింది! అదే టామ్ హోలాండ్ నటించిన 'స్పైడర్‌మ్యాన్: బ్రాండ్ న్యూ డే'

భారత్‌లో ఏకంగా రూ.500 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించి, ఈ ఘనత సాధించిన 'తొలి హాలీవుడ్ సినిమా'గా రికార్డుల్లోకెక్కింది

మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగమైన ఈ స్పైడర్‌మ్యాన్ చిత్రం జులై 30న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలతో విడుదలైంది. మొదటి రోజు నుంచే థియేటర్లలో కళ్లుచెదిరే వసూళ్లతో ప్రభంజనం సృష్టించింది. కేవలం తొలి వారంలోనే ఏకంగా రూ.330 కోట్లకు పైగా కలెక్ట్ చేసిన ఈ చిత్రం, కేవలం 39 రోజుల్లోనే రూ.500 కోట్ల మైలురాయిని అధిగమించి అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఇక ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఇప్పటివరకు గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.22,600 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టినట్లు హాలీవుడ్ విశ్లేషకులు చెబుతున్నారు.స్పైడర్‌మ్యాన్‌గా టామ్ హోలాండ్ సృష్టించిన ఈ వసూళ్ల సునామీ హాలీవుడ్ చరిత్రలోనే ఒక ల్యాండ్‌మార్క్‌గా నిలిచిపోనుంది!

Next Story