హనీ రోజ్?

Honey Rose: ప్రస్తుతం టాలీవుడ్ ఫిలిం నగర్ వర్గాల్లో ఒక ఊహించని నయా రూమర్ జోరుగా చక్కర్లు కొడుతోంది. మలయాళ బ్యూటీ హనీ రోజ్.. మెగాస్టార్ చిరణ్జీవి నటిస్తున్న తదుపరి చిత్రం నుండి తప్పుకుందనేది ఈ గాసిప్ సారాంశం. మొదట ఈ ప్రాజెక్ట్‌లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఈ బ్యూటీ, ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ సడన్‌గా ఈ సినిమాను వదులుకుందని టాక్ వినిపిస్తోంది.
సాధారణంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో హనీ రోజ్ రెగ్యులర్‌గా సినిమాలు చేయడం లేదు. అలాంటిది మెగాస్టార్ చిరంజీవి వంటి అగ్ర హీరో సరసన స్క్రీన్ షేర్ చేసుకునే గోల్డెన్ ఛాన్స్ వస్తే ఏ నటి అయినా వదులుకోవడానికి ఇష్టపడదు. అందుకే ఈ వార్త ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర కోసం (ప్రధాన హీరోయిన్ కాకపోయినప్పటికీ) హనీ రోజ్‌ను సైన్ చేయించుకున్నట్లు ఇండస్ట్రీ టాక్.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ తాజా షెడ్యూల్‌లో చిరంజీవితో పాటు ఆయనకు కుమార్తె పాత్రలో నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్న మలయాళ నటి అనస్వర రాజన్ కూడా పాల్గొంటున్నారు. ప్రధానంగా మలయాళ పరిశ్రమలోనే బిజీగా ఉండే హనీ రోజ్.. నందమూరి బాలకృష్ణ సరసన నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం “వీరసింహారెడ్డి”తో టాలీవుడ్‌లోకి ఘనంగా ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటివరకు తెలుగులో ఆమె చేసిన ఏకైక సినిమా అదే కావడం విశేషం. అందుకే, చిరంజీవి ప్రాజెక్ట్ నుండి ఆఫర్ రాగానే ఆమె ఎంతో సంతోషంగా దీనికి అంగీకరించిందని అప్పట్లో వార్తలు వచ్చాయి.
అయితే, తాజాగా అందుతున్న లీకుల ప్రకారం.. కొన్ని తెలియని కారణాల వల్ల ఆమె ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ నుండి తప్పుకుందని ఇన్ సైడ్ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న షూటింగ్‌కు ఆమె హాజరుకాలేదని, కనీసం ఆమెకు చిత్ర యూనిట్ నుండి పిలుపు కూడా వెళ్లలేదని సమాచారం. కొన్ని వ్యక్తిగత కారణాలను (పర్సనల్ రీజన్స్) చూపుతూ ఆమె ఈ సినిమా నుండి తప్పుకున్నట్లు ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తోంది. అయితే, ఈ ప్రచారంపై అటు హనీ రోజ్ కానీ, ఇటు చిత్ర బృందం (మేకర్స్) కానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

