పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే.?

Andhra King Taluka: యువ కథానాయకుడు రామ్ పోతినేని (Ram Pothineni) ప్రధాన పాత్రలో నటించిన ఆంధ్ర కింగ్ తాలుకా ఈ సినిమా ఈ రోజు విడుదలైంది. ఉదయం నుండే ఫస్ట్ షోలు, ప్రీమియర్‌లు మొదలవడంతో, సినిమాపై పబ్లిక్ టాక్ మొదలైంది. ఇది ఒక స్టార్ హీరోకు, ఆయన వీరాభిమానికి మధ్య ఉండే అనుబంధం, ఎమోషన్స్ నేపథ్యంలో నడిచే డ్రామా. రామ్ ఇందులో అభిమాని పాత్రలో నటించారు.

పాజిటివ్ అంశాలు

సినిమాలోని హీరో-అభిమాని మధ్య సన్నివేశాలు, తండ్రీ-కొడుకుల మధ్య వచ్చే ఎమోషనల్ ఘట్టాలు బాగా పండాయని టాక్. చివరి 45 నిమిషాలు ప్రేక్షకులను కదిలిస్తాయని చెబుతున్నారు. మాస్ ఇమేజ్ తర్వాత, మళ్లీ పక్కింటి కుర్రాడిపాత్రలో రామ్ చాలా బాగా నటించారని, ఆయన ఎమోషన్స్ అద్భుతంగా ఉన్నాయని అంటున్నారు.'ఆంధ్రా కింగ్' సూర్యకుమార్ పాత్రలో కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర నటన సినిమాకు ఒక ఎస్సెట్.

వివేక్-మెర్విన్ అందించిన పాటలు, నేపథ్య సంగీతం సినిమా మూడ్‌ను బాగా ఎలివేట్ చేశాయని టాక్ ఉంది.

మైనస్ అంశాలు

ఫస్ట్ హాఫ్‌లో కొంత నెమ్మదిగా సాగడం లేదా కొన్ని అనవసరమైన సన్నివేశాలు ఉండటం.నిడివి కొంచెం ఎక్కువగా ఉండటం (సుమారు 2 గంటల 40 నిమిషాలు). మొత్తం మీద సినిమాకు పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా ఎమోషనల్ డ్రామాను, రామ్ పెర్ఫార్మెన్స్‌ను ఇష్టపడే ప్రేక్షకులను ఈ సినిమా బాగా ఆకట్టుకునే అవకాశం ఉంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story