Mana Shankara Varaprasad Garu: మన శంకర వరప్రసాద్ గారు పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే.?
పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే.?

Mana Shankara Varaprasad Garu: మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాకు సంబంధించిన పబ్లిక్ టాక్, రివ్యూలు చాలా పాజిటివ్‌గా ఉన్నాయి.చాలా కాలం తర్వాత చిరంజీవిని ఆయన పాత సినిమాలైన చంటబ్బాయ్, రౌడీ అల్లుడు స్టైల్‌లో కామెడీ టైమింగ్‌తో చూడటం బాగుందని ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. దర్శకుడు అనిల్ రావిపూడి తనదైన శైలిలో వినోదాన్ని (Entertainment) పండించారని, ఫస్ట్ హాఫ్ మొత్తం నవ్వులతో సాగిపోతుందని టాక్. సినిమాలో విక్టరీ వెంకటేష్ గెస్ట్ రోల్‌లో కనిపించడం, చిరంజీవి-వెంకటేష్ కలిసి చేసిన సీన్స్ , సాంగ్ థియేటర్లలో ఈలలు వేయిస్తున్నాయి. శశిరేఖ పాత్రలో నయనతార నటన, చిరంజీవితో ఆమె కెమిస్ట్రీ హుందాగా ఉందని ప్రేక్షకులు చెబుతున్నారు. మన శంకర వరప్రసాద్ గారు" ఒక కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సంక్రాంతి పండక్కి కుటుంబంతో కలిసి సరదాగా నవ్వుకోవడానికి ఈ సినిమా పక్కా ఛాయిస్ అని పబ్లిక్ టాక్ వినిపిస్తోంది.
ప్లస్ పాయింట్లు:
చిరంజీవి ఎనర్జీ, వింటేజ్ కామెడీ
అనిల్ రావిపూడి కామెడీ డైలాగులు
హుక్ స్టెప్ సాంగ్స్ , బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్.
సెకండ్ హాఫ్‌లో వచ్చే ఫ్యామిలీ ఎమోషన్స్.
మైనస్ పాయింట్లు:
కథలో పెద్దగా కొత్తదనం లేకపోవడం (రొటీన్ ఫ్యామిలీ డ్రామా).
కొన్ని చోట్ల లాజిక్ లేని సన్నివేశాలు.

