ట్రైలర్ ఎలా ఉందంటే.,?

The Raja Saab 2.0 Trailer: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానుల ఎదురుచూపులకు తెరదించుతూ 'ది రాజాసాబ్' ట్రైలర్ 2.0 విడుదలైంది.ఈ కొత్త ట్రైలర్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది.

మొదటి ట్రైలర్ కామెడీపై దృష్టి పెట్టగా, ఈ రెండో ట్రైలర్ అసలు కథను పరిచయం చేసింది. ఇది ఒక పవర్‌ఫుల్ హారర్ రొమాంటిక్ ఫాంటసీ అని స్పష్టమవుతోంది. తాత (సంజయ్ దత్), మనవడు (ప్రభాస్) మధ్య జరిగే ఆత్మీయ, ఆసక్తికరమైన పోరాటంగా ఈ సినిమా ఉండబోతోంది.

ఇందులో ప్రభాస్ విభిన్న అవతారాల్లో కనిపిస్తున్నారు. ముఖ్యంగా ట్రైలర్ చివరలో కనిపించిన జోకర్ (Joker) లుక్ , వింటేజ్ గెటప్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

ఎస్.ఎస్. థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ (BGM), భారీ విజువల్ ఎఫెక్ట్స్ (VFX) హాలీవుడ్ స్థాయిలో ఉన్నాయని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.మారుతి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంజయ్ దత్, బొమన్ ఇరానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

జనవరి 9 సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.జనవరి 8న రాత్రి నుంచే కొన్ని చోట్ల పెయిడ్ ప్రీమియర్స్ నిర్వహించే అవకాశం ఉంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story