ఎన్ని కోట్లో తెలుసా.?

Dalapati Vijay: వెండితెరపై దళపతిగా కోట్లాది మంది నీరాజనాలు అందుకున్న విజయ్, ఇప్పుడు రాజకీయ రంగప్రవేశం చేస్తూ తన ఆస్తుల వివరాలను బహిర్గతం చేశారు. పెరంబూర్ , తిరుచ్చి ఈస్ట్ స్థానాల నుండి పోటీ చేస్తున్న విజయ్ ఆస్తుల చిట్టా ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

అఫిడవిట్ ప్రకారం, విజయ్ మొత్తం ఆస్తుల విలువ సుమారు 603 కోట్ల రూపాయలు. ఇందులో ఆయన చరాస్తులు (Movable Assets) విలువ దాదాపు 404.58 కోట్ల రూపాయలు. ముఖ్యంగా చెన్నై సాలిగ్రామంలోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఖాతాలోనే ఆయనకు 213 కోట్ల రూపాయలకు పైగా నగదు నిల్వలు ఉండటం విశేషం. ఇక ఆయన భార్య సంగీత పేరిట సుమారు 15.76 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

విజయ్‌కు కార్లంటే ఉన్న మక్కువ మనందరికీ తెలిసిందే. ఆయన వద్ద ఉన్న విలాసవంతమైన కార్ల విలువ సుమారు 6 కోట్ల రూపాయలు. ఇందులో బి.ఎమ్.డబ్ల్యూ (BMW 530), టయోటా వెల్‌ఫైర్ వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి. ఇక ఆభరణాల విషయానికి వస్తే.. విజయ్ వద్ద 1.20 కోట్ల రూపాయల విలువైన 883 గ్రాముల బంగారం ఉండగా, ఆయన భార్య వద్ద 4 కోట్ల రూపాయల విలువైన బంగారం మరియు కోటి రూపాయల విలువైన వజ్రాలు ఉన్నాయి.

కేవలం నగదు, నగలే కాదు.. విజయ్ వివిధ సంస్థలు, ట్రస్టులలో దాదాపు 56 కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు పెట్టారు. విద్యా , సామాజిక సేవా సంస్థల్లో కూడా ఆయన భాగస్వామ్యం ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో (2024-25) ఆయన వార్షిక ఆదాయం సుమారు 184.53 కోట్ల రూపాయలుగా చూపించారు. ఇది ఆయన సినీ కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు వచ్చిన ఆదాయం.

సినిమాల్లో రికార్డులు సృష్టించిన దళపతి, ఇప్పుడు తన పారదర్శకమైన అఫిడవిట్‌తో రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం చూపుతారో వేచి చూడాలి. 'విజిల్' గుర్తుతో ప్రజల ముందుకు వెళ్తున్న విజయ్ ప్రయాణం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story