చిరు అనిల్ సినిమా డిజిటల్ రైట్స్‌కు భారీ డిమాండ్
Huge demand for digital rights of Chiranjeevi's movie

మెగాస్టార్ చిరంజీవి మరియు దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందుతున్న కొత్త చిత్రం డిజిటల్ రైట్స్ కోసం రూ. 50 కోట్లు పలుకుతునట్లు ఇండస్ట్రీ వర్గాల నుంచి సమాచారం . సినిమా ఇంకా షూటింగ్ దశలోనే ఉన్నప్పటికీ, చిరంజీవి భారీ ఫ్యాన్ బేస్ మరియు అనిల్ రావిపూడి బ్లాక్‌బస్టర్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లకు పెట్టింది పేరు. దీంతో ఓటీటీ సంస్థల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, ZEE5 వంటి ప్లాట్‌ఫామ్‌లు ఈ చిత్రం డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నాయని తెలుస్తోంది. ఈ డీల్ ఖరారైతే, తెలుగు సినిమా డిజిటల్ మార్కెట్‌లో ఇది కొత్త రికార్డుగా నిలిచే అవకాశం ఉంది.
చిరంజీవి బ్రాండ్ వాల్యూ, అనిల్ ట్రాక్ రికార్డ్: చిరంజీవి నటించిన చిత్రాలు ఎప్పుడూ థియేటర్లలోనే కాక, ఓటీటీలో కూడా భారీ ఆదరణ పొందుతాయి. ‘వాల్తేరు వీరయ్య’ నెట్‌ఫ్లిక్స్‌లో రికార్డు వ్యూస్ సాధించగా, ‘భోళా శంకర్’ కూడా మంచి స్పందనను రాబట్టింది. ఈ నేపథ్యంలో, చిరు అనిల్ సినిమా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనుండటం, అనిల్ రావిపూడి గత చిత్రం , సంక్రాంతికి వస్తున్నాం, ‘సరిలేరు నీకెవ్వరు’ వంటి బ్లాక్‌బస్టర్ ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకోవడం వల్ల ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
