Ram Charan Creates New Sensation: ఢిల్లీ వీధుల్లో పెద్ది హంగామా.. రామ్ చరణ్ నయా సెన్సేషన్
రామ్ చరణ్ నయా సెన్సేషన్
Ram Charan Creates New Sensation: రామ్ చరణ్ కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం పెద్ది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దేశ రాజధాని ఢిల్లీలో శరవేగంగా జరుగుతోంది. మైత్రి మూవీ మేకర్స్ ఎక్కడా రాజీ పడకుండా భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. దర్శకుడు బుచ్చిబాబు సానా ఈ సినిమాను విజువల్ గ్రాండ్‌గా చూపించేందుకు ఢిల్లీలోని ఐకానిక్ ప్రదేశాలను ఎంచుకున్నారు.
అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియం, ఏపీ భవన్, పార్లమెంట్ పరిసరాలు మరియు ఇండియా గేట్ వద్ద కీలక షెడ్యూల్స్ ప్లాన్ చేశారు. ప్రైమ్ మినిస్టర్ మ్యూజియం అధికారులతో ఇటీవల చరణ్ భేటీ అయిన ఫోటోలు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి.
నార్త్ ఇండియాలో చరణ్ క్రేజ్
RRR సినిమాతో గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన రామ్ చరణ్‌ను చూసేందుకు ఢిల్లీలో అభిమానులు బారులు తీరుతున్నారు. కేవలం ఫ్యాన్స్ మాత్రమే కాదు, అక్కడ భద్రత కల్పిస్తున్న పోలీస్ సిబ్బంది కూడా చరణ్‌తో ఫోటోలు దిగేందుకు ఆసక్తి చూపడం విశేషం. దీన్ని బట్టి ఉత్తరాదిలో చెర్రీకి ఉన్న పాపులారిటీ ఏంటో స్పష్టమవుతోంది. ఈ సినిమాలో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తుండగా, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ఒక పవర్‌ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌లోని క్రికెట్ షాట్స్.. చికిరి చికిరి సాంగ్‌లోని స్టెప్పులు సినిమాపై అంచనాలను ఆకాశానికి తీసుకెళ్లాయి.



